Share News

మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:48 AM

రాజమహేంద్రవరంలోని డివిజన్లలో మెరుగైన పారిశుధ్యం, మౌ లిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మునిసిపల్‌ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో పలు డివిజన్ల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన 23 అర్జీలు స్వీకరించారు.

మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు ఆదేశిస్తున్న కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

  • మునిసిపల్‌ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలోని డివిజన్లలో మెరుగైన పారిశుధ్యం, మౌ లిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మునిసిపల్‌ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో పలు డివిజన్ల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన 23 అర్జీలు స్వీకరించారు. ఇళ్ల స్థలాల ఆక్రమణలు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలు, ఇంటి పన్నుల పేరుమార్పులు తదితర సమస్యలపై అర్జీలు పెట్టుకున్నారు. వాటిని పరిశీలన చేసి నాణ్యమైన పరిష్కారాలు చూపించాలని సంబంధిత అధికారులను కమిషనర్‌ ఆదేశించారు.

  • ఆక్రమణలు తొలగించాలి

నగరంలోని కోరుకొండ రోడ్డులో కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తని ఖీలు చేశారు. రహదారి విస్తరణకు మార్కింగ్‌ వేయాలని, తాత్కాలిక, శాశ్వత ఆక్రమణలను గుర్తించి తక్షణమే తొలగించాలని అధికారులకు సూచించారు. నగరంలో ఆక్రమలు తొలగింపు ప్రక్రియ ప్రతిరోజు జరగాలన్నారు. సీఅండ్‌డీ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, నిర్మాణంలో ఉన్న భవనాలను ఆకుపచ్చగుడ్డతో మూసివేసేలా నిర్మాణదారులకు తెలియజేయాలని చెప్పారు. అనంతరం కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకుని వెబ్‌ ఎక్స్‌ ద్వారా కమిషనర్‌ సచివాలయ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి అధికారి సిబ్బంది తమకు కేటాయించిన విధులపై ఉదయం తనిఖీలు నిర్వహించాలని, ఎమినిటీ సెక్రటరీలు ఉదయం 6నుంచి నీటి సరఫరాను పరిశీలించాలని, శానిటేషన్‌ సెక్రటరీలు డ్రైన్లలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించే పనులు చేయించాలని పేర్కొన్నారు. పన్నుపై 5శాతం రాయితీ అంశాన్ని నగరంలో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. కార్యక్ర మాల్లో అదనపు కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.వెంకటరమణ, ఎస్‌ఈ ఎంసీహెచ్‌ కోటేశ్వరరావు, సిటీ ప్లానర్‌ జి.కోటయ్య, ఎంహెచ్‌వో డాక్టర్‌ ఎ.వినూ త్న, సెక్రటరీ శైలజావల్లి, మేనేజరు అబ్దుల్‌ మాలిక్‌ అస్ఫర్‌, రెవెన్యూ అధికారి సీహెచ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:48 AM