Share News

పక్కా కమర్షియల్‌!

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:31 AM

అంతా మా ఇష్టం.. అడిగే దెవడురా అంతా మా ఇష్టం.. అనుకున్నారో ఏమో కానీ.. గత ప్రభుత్వ హయాంలో నిబం ధనలు అతిక్రమించి బహుళ అంతస్తుల నిర్మా ణాలు చేపట్టారు.

పక్కా కమర్షియల్‌!
ధవళేశ్వరంలో పంచాయతీ వద్ద ఒక భవనం

ప్లాన్‌ ప్రకారమే నిర్మాణాలు

అధికారుల మామూళ్ల మత్తు

యథేచ్ఛగా సహకరిస్తున్న వైనం

కళ్లెదుటే ఉన్నా కనిపించదు

పెరుగుతున్న అక్రమ భవనాలు

నిబంధనలు హుష్‌ కాకి

నోటీసులతో సరి

రాజమహేంద్రవరం రూరల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : అంతా మా ఇష్టం.. అడిగే దెవడురా అంతా మా ఇష్టం.. అనుకున్నారో ఏమో కానీ.. గత ప్రభుత్వ హయాంలో నిబం ధనలు అతిక్రమించి బహుళ అంతస్తుల నిర్మా ణాలు చేపట్టారు. అయినా అధికారులు నేటికీ చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారకపోవడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మా మూళ్ల మత్తులో అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆక్రమించేసి.. కట్టేసి?

కాదేది ఆక్రమణలకు అనర్హం అన్నట్టు ఉంది పరిస్థితి. రోడ్లు, కాలువలు, ఇరిగేషన్‌ స్థలాలు, దేవాదాయ శాఖ, ఏసీఐఐసీ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా తూతూ మంత్రంగా నోటీసులిచ్చి చేతులు దు లుపుకుం టున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక పైపు జిల్లా కలెక్టర్‌.. మరో వైపు నగరపాలక సంస్థ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీచేసినా పంచా యతీ రాజ్‌ అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో అక్రమ నిర్మాణదారు లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెల కొంది. రాజమహేంద్రవరం రూరల్‌ మండల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ నిర్మాణాలకు ప్లాన్‌ తీసుకొని కమర్షియల్‌ భవ న నిర్మాణాలు చేపడుతున్నా అధికారుల మా త్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం తో ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపా యలు గండిపడుతుంది. ఈ తతంగంలో అధి కారులు, కొంత మంది స్థానిక నాయకుల జేబులు నిండుతున్నాయని ఆరోపణలు విని పిస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరువలో ఇలాంటి అక్రమాలు బోలెడు ఉన్నా యి. ధవళేశ్వరం పంచాయతీ ఎదురుగా రెసిడెన్షియల్‌ అనుమతులు తీసుకొని ఏకంగా ఫంక్షన్‌ హాల్‌ నిర్వహిస్తున్నారు. అదే గ్రామం కొత్తపేట ప్రాంతంలో నల్లా కాలువ ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టినా నోటీసులిచ్చి చేతులు దులుపుకు న్నారు. బొమ్మూరు పంచాయతీ పరిధి బాలా జీపేట సెంటరులో రెసిడెన్షియల్‌ అనుమ తులు తీసుకుని సెమీ రెసిడెన్షియల్‌ భవన నిర్మాణం చేపట్టి ఒక బ్యాంక్‌కు అద్దెకు ఇచ్చా రు. పిడింగొయ్యి పంచాయతీ పరిధి జగదీశ్వరీ లేఅవుట్‌లో సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం వెనుక ప్రాంతంలో రెసిడెన్షియల్‌ అనుమతులు తీసు కుని కళ్యాణమండపం నిర్మించారు. హు కుం పేట పంచాయతీ రామకృష్ణ నగర్‌లో నిబం ధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫ్లోర్‌ను కూల్చి వేయాలంటూ లోకాయుక్త నుంచి ఆదేశాలు వచ్చినా అధికారులు మాత్రం భవన యజయానితో కుమ్మక్కై నాన్చుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్రమ నిర్మాణాలు అటు రాజమహేంద్రవరం నగరం.. ఇటు రూరల్‌లో బోలెడు.. రూరల్‌ మండలం పరిధిలోని వెంక టనగరం,కాతేరు, కోలమూరు, శాటి లైట్‌ సిటీ, రాజవోలు, తదితర ప్రాంతాలతో పాటు రాజ మహేంద్రవరం డివిజన్‌ పరిధిలో చాలా అక్ర మ నిర్మాణాలు ఉన్నాయి. దీనిపై పంచాయతీ కార్యదర్శులను ప్రశ్నిస్తే నోటీసులిచ్చాం మా పనైపోయిందన్నట్టు చెబుతున్నారు. ఉన్నతాధి కారులు దృష్టిసారించి అక్రమ భవన నిర్మాణ దారులపై చర్యలు చేపట్టాలని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:31 AM