Share News

పంట కాల్వల ఆధునికీకరణ

ABN , Publish Date - Apr 26 , 2025 | 01:03 AM

ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి.. ప్రజల సమస్యలు పరిష్కరించాలి..ప్రజలకు సమస్య లు రాకుండా చూసుకోవాలి. ప్రస్తుత ప్రభు త్వం అదే చేస్తోంది.

పంట కాల్వల ఆధునికీకరణ

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి.. ప్రజల సమస్యలు పరిష్కరించాలి..ప్రజలకు సమస్య లు రాకుండా చూసుకోవాలి. ప్రస్తుత ప్రభు త్వం అదే చేస్తోంది. దీనిలో భాగంగా పంట కా ల్వలపై అభివృద్ధిపై దృష్టి పెట్టింది.. గత వైసీపీ ప్రభుత్వంలో అయితే ఐదేళ్లూ ఆ ఊసే లేదు. నీటి సంఘాలను పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సీజన్‌ లో కాలువల ద్వారా నీరందక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వైపు భారీవర్షాల వల్ల ముంపు ఏర్పడినపుడు చేలలలోని నీరు తిరిగి, బోదుల గుండా బయటకు వచ్చే వీలు లేక నష్టాల పాలయ్యారు. రేపో ఎల్లుండో కాల్వలు కట్టివేయనున్నారు. ఈ నేపథ్యంలో పంట కాల్వ ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.

పంట కాల్వల ఆధునికీకరణకు..

ధవళేశ్వరం బ్యారేజి పరిఽధిలో తూర్పు, మ ధ్య, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలతో పాటు, వాటి పిల్ల కాలువలు,బోదెలు ఉంటాయి. అవ న్నీ శుభ్రంగా, పటిష్టంగా ఉంటేనే నీరు పారు దల సక్రమంగా ఉంటుంది.గోదావరి బ్యారేజి నుంచి కాలువల్లోకి వెళ్లిన నీరు సులభంగా పం టబోదెల ద్వారా చేలల్లోకి చేరుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా సమ్మర్‌లో కాలువల ఆపరేషన్‌ అండ్‌ మెయింట్‌నెన్స్‌ (ఓ అండ్‌ఎం) నిధులు ఇచ్చి నీటి సంఘాలతో పనులు చేయించేవారు.ఈ ఏడాది అదే విధా నాన్ని అవలంభించనున్నారు.ఈ మేరకు ముం దస్తుగా నీటి సంఘాలను ఎంపిక చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు, కొవ్వూరు డివిజన్‌లో మొత్తం నీటి సంఘాలు 432 ఉన్నాయి. డిస్ర్టి బ్యూటరీ కమిటీ (డీసీ)లు 37,ప్రాజెక్టు కమిటీ (పీసీ)లు 8 ఉన్నాయి. అందులో తూర్పుగోదావరి జిల్లాలో నీటి సం ఘాలు 113, డీసీలు 6, పీసీలు 2 ఉన్నాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో నీటి సంఘాలు 83, డీసీలు 14, పీసీ 1 ఉంది. కాకినాడ జిల్లాలో నీటి సంఘాలు 236, డీసీలు 17, పీసీలు 5 ఉన్నాయి.ప్రస్తుతం రూ.10 లక్షల్లోపు కాలువల అభివృద్ధి పనులన్నీ వీరి ఆధ్వర్యంలోనే జరగ నున్నాయి. డీసీలు,పీసీల సలహాల మేరకు పెద్ద పనులపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు.

అసెంబ్లీ పనులు నిధులు(కోట్లు)

అమలాపురం 107 3.5 కోట్లు

కాకినాడ రూరల్‌ 53 1.9

కొత్తపేట 68 2.9

మండపేట 67 2.6

ముమ్మడివరం 85 3.4

పి.గన్నవరం 53 2.4

పెద్దాపురం 51 2.3

రాజమండ్రి రూరల్‌ 10 62.8 లక్షలు

రామచంద్రపురం 79 2.9 కోట్లు

రాజోలు 61 2.5

జగ్గంపేట 31 2.0

పిఠాపురం 3.9

ప్రత్తిపాడు 26 99.86 లక్షలు

రంపచోడవరం 3 23.99

తుని 35 74.98 లక్షలు

అనపర్తి 31 1.17 కోట్లు

కొవ్వూరు 28 2.02

గోపాలపురం 16 92.02 లక్షలు

మొత్తం 1742 పనులకు రూ.68.64 కోట్లతో పనులు ప్రతిపాదించారు. రెండు మూడు రోజుల్లో శాంక్షన్‌ ఉత్తర్వులు వస్తాయని ధవళేశ్వరం సర్కిల్‌ ఎస్‌ఈ గోపినాథ్‌ తెలిపారు. పనులన్నీ ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, మంత్రుల సలహాలు, సూచనల మేరకు ప్రతిపాదించారు.

రేపు కాలువల మూత

ధవళేశ్వరం సర్కిల్‌ పరిధిలో తూర్పు, పశ్చి మ, మధ్య డెల్టా కాలువలకు ఈనెల 27 నుంచి నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో కాలువల అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధవళేశ్వరం గోదావరి పరిధిలోని ఉమ్మడి ఉభయ గోదా వరి జిల్లాల వ్యాప్తంగా 33 నియోజకవర్గాల్లో రూ.66.64 కోట్లతో 1747 పనులు చేయడా నికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రెండు మూడు రోజుల్లో వాటికి అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేయనున్నా రు.ఉత్తర్వులు వచ్చిన వెంటనే కాలు వల్లో నీరు తగ్గిన తర్వాత నీటి సంఘాలు పనులు చేపడతాయి.అసెంబ్లీ నియోజకవర్గాల వారీ పనులు గుర్తించారు. అన్ని నియోజకవర్గా ల్లో ప్రధాన పంట కాలువలు, పిల్లకాలువలు సుమారు 4 వేల కి.మీ మేర ఉంటాయి.

Updated Date - Apr 26 , 2025 | 01:03 AM