Share News

క్రైస్తవులపై దాడులను అరికట్టాలి

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:44 AM

రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టా లని, పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతికి కారకు లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలం లోని రంపయర్రంపాలెంలో సోమవారం క్రైస్తవ సంఘాల పాస్టర్స్‌, సంఘ పెద్దలు శాంతియుత ర్యాలీ చేపట్టారు.

క్రైస్తవులపై దాడులను అరికట్టాలి
రంపయర్రంపాలెంలో చేపట్టిన శాంతియుత ర్యాలీ

  • పాస్టర్‌ ప్రవీణ్‌ మృతికి సంతాపంగా రంపయర్రంపాలెం, సీతానగరంలో శాంతియుత ర్యాలీలు

గోకవరం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టా లని, పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతికి కారకు లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలం లోని రంపయర్రంపాలెంలో సోమవారం క్రైస్తవ సంఘాల పాస్టర్స్‌, సంఘ పెద్దలు శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ ప్రవీణ్‌ పగడాల మృ తిపై సమగ్ర విచారణ జరిపి నిం దితులపై కఠిన చర్యలు తీసుకోవా లన్నారు. ఉన్నతమైన భావజాలాలు కల్గిన పాస్టర్‌ ప్రవీణ్‌ను అతికిరాత కంగా హత్య చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విచారణ ను మరింత వేగవంతం చేసి సం బంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. అన్ని సీసీ కెమెరాల పుటేజీలను బయట పెట్టాలని డిమాండు చే శారు. కార్యక్రమంలో వివిధ సంఘాల పాస్టర్లు, పెద్దలు పాల్గొన్నారు.

  • సీతానగరంలో..

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతి వెనుక ఉన్న నిజాలను విచారించి న్యాయం చేయాలని కోరుతూ పాస్టర్‌ నారాయణమూర్తి ఆధ్వర్యంలో మండల ఐక్య క్రైస్తవ సమాజం శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ పాస్టర్‌ ప్రవీణ్‌కు జరిగిన ప్రమాదాన్ని వివాదాస్పద మృతిగాను, హత్యగాను చిత్రీకరించారని, పోలీసులు కూడా వివాదాస్పద మృతిగానే కేసు నమోదు చేశారన్నారు. అది ప్రమాదమా? హత్యా? అనే విషయాలను తేల్చి సమాజానికి, క్రైస్తవులకు వారి మనోభావాలకు మనోధైర్య ఇచ్చే విధంగా త్వరగా విచారణ చేసి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నా రు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రాజీవ్‌ జోషి య్య, నక్కా జాయ్‌, గెడ్డం రత్నం, సనమండ్ర ఆశీర్వాదం పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 12:44 AM