Share News

నీటి తీరువా వసూళ్లు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:43 AM

జిల్లాలో నీటి తీరువా వసూలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ పి. ప్రశాంతి ఆదేశించారు. జేసీ చిన్నరాముడు, డీఆర్వో టి.సీతారామమూర్తితో కలిసి గురువారం రెవెన్యూ, పీజీ ఆర్‌ఎస్‌, రీసర్వే వంటి అంశాలపై సమీక్షించారు.

నీటి తీరువా వసూళ్లు వేగవంతం చేయాలి
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

రాజమహేంద్రవరం,ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నీటి తీరువా వసూలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ పి. ప్రశాంతి ఆదేశించారు. జేసీ చిన్నరాముడు, డీఆర్వో టి.సీతారామమూర్తితో కలిసి గురువారం రెవెన్యూ, పీజీ ఆర్‌ఎస్‌, రీసర్వే వంటి అంశాలపై సమీక్షించారు. మండలాల వారీగా నీటివినియోగదారుల సంఘాల వివరాలు ప్రచు రించాలన్నారు. నీటి తీరువా వసూళ్ల విషయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పర్యవేక్షణ చేయి స్తుందన్నారు.జిల్లాలో 2.8 లక్షల ఎకరాల ఆయకట్టు పరి ధిలో రూ.2,84, 51,378 మేర పన్నులు వసూలు కావాల్సి ఉంద న్నారు.ఇప్పటి వరకూ రూ.2,00,11,361 వసూలైందన్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో 40.57 శాతం, కొవ్వూరు డివి జన్‌ లో 43.75 శాతం వసూళ్లు చేసినట్టు చెప్పారు. ఆయకట్టు పరిధిలో సాగు విస్తీర్ణం హెచ్చుతగ్గులను రెవెన్యూ, ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్ధారణ చేయాలని ఆదేశించారు. ప్రజా సమ స్యల పరిష్కార వేదికలో ముఖ్యంగా భూమి కొలతల్లో వ్యత్యా సాలు,ఎల్‌పీఎంకు చెందిన విభజన, దిద్దుబాట్లు, మ్యుటేషన్‌, సరి హద్దు కొలతలు ఐదు అంశాలు ఉన్నాయన్నారు. కొందరు సమీక్షలకు వచ్చామా, వెళ్లామా అనే ధోరణిలోనే ఉంటున్నారని అది సరికాద న్నారు. సమావేశంలో ఆర్డీవోలు ఆర్‌.కృష్ణనాయక్‌, రాణి సుస్మిత, హౌసింగ్‌ పీడీ ఎస్‌.భాస్కరరెడ్డి, జిల్లా సర్వే అధికారి బి. లక్ష్మీ నారాయణ, ఏవో అలీ, తహశీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:43 AM