Share News

రాజానగరం అభివృద్ధికి సహకరించండి

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:13 AM

రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రితో ఆయన మం గళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకంలో ప్రభుత్వం సేకరించిన భూములకు నష్ట పరిహా రం చెల్లించాలని, కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భూములను నిషేధిత జా బితా నుంచి తొలగించాలని, సత్యసాయి డ్రిం కింగ్‌ వాటర్‌ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని సీఎంకు విన్నవించారు.

రాజానగరం అభివృద్ధికి సహకరించండి
సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బత్తుల

  • అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో బత్తుల భేటీ

  • నియోజకవర్గ సమస్యలపై వినతి

రాజానగరం, మార్చి 18 (ఆంధజ్యోతి): రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రితో ఆయన మం గళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకంలో ప్రభుత్వం సేకరించిన భూములకు నష్ట పరిహా రం చెల్లించాలని, కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భూములను నిషేధిత జా బితా నుంచి తొలగించాలని, సత్యసాయి డ్రిం కింగ్‌ వాటర్‌ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని సీఎంకు విన్నవించారు. అలాగే రూ.681 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసి, నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిం చాలన్నారు. తొర్రేడు-సీతానగరం అర్‌అండ్‌బీ రోడ్డు, సీతానగరం-పురుషోత్తపట్నం పంచాయ తీ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని కోరారు. కోరుకొండ ఆలయ అభివృద్ధికి రూ.36 కోట్లతో ఇచ్చిన డీపీఆర్‌ కార్యరూపం దాల్చేలా సహక రించాలని, ఇళ్ల స్థలాల కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రాబోయే పుష్కరాల దృష్ట్యా సీతాన గరం ప్రాంతంలో 8 ఘాట్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, ధాన్యం రైతులకు బకాయిలు చెల్లించాలని కోరారు. ఆయా అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారని, సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే బత్తుల పేర్కొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 01:13 AM