Share News

పూర్తి అదుపులో డయేరియా

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:26 AM

గొల్లప్రోలు రూరల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో డయేరియా పూర్తి అదుపులో ఉం దని డీఎంహెచ్‌వో నరసింహనాయక్‌ తెలిపారు. బుధవారం ఆయన ఆ గ్రామంలో పర్యటించి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను

పూర్తి అదుపులో డయేరియా
గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పర్యటిస్తున్న డీఎంహెచ్‌వో నరసింహనాయక్‌

చేబ్రోలులో ఐదు వైద్య బృందాల ఏర్పాటు : కాకినాడ జిల్లా డీఎంహెచ్‌వో

గొల్లప్రోలు రూరల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో డయేరియా పూర్తి అదుపులో ఉం దని డీఎంహెచ్‌వో నరసింహనాయక్‌ తెలిపారు. బుధవారం ఆయన ఆ గ్రామంలో పర్యటించి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను, తాగునీటి సరఫరా కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చేబ్రోలు పీ హెచ్‌సీలో 5 రోజుల వ్యవధిలో 29 డయేరియా కేసులు వచ్చాయని చెప్పారు. ఇంటింటా సర్వెలెన్స్‌ కోసం 5 వైద్య బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక ఫంక్షన్‌లో మాంసాహారం తినడం వల్ల కేసులు వచ్చినట్టు భావిస్తున్నామని చెప్పారు. బుధవారం కొత్తగా కేసులు నమోదు కాలేదని తెలిపారు. 8 తాగునీటి శాంపిల్స్‌ సేకరించామని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కాగా ప్రైవేటు ఆసుపత్రులో పలువురు వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఇంకా చికిత్స పొందుతున్నా రు. గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

Updated Date - Apr 24 , 2025 | 12:26 AM