చేబ్రోలులో ప్రబలిన డయేరియా
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:16 AM
గొల్లప్రోలు రూరల్, ఏప్రిల్ 22 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో డయేరియా ప్రబలింది. నా లుగు రోజుల్లో 100మందికి పైగా విరోచనాలతో బాధపడుతూ పీహెచ్‌సీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరారు. అయితే ఈ విషయాన్ని వైద్యాధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేబ్రోలులో వాం తులు విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి అధికమ
4రోజుల్లో 100మందికి అస్వస్థత
పీహెచ్‌సీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స
గోప్యంగా ఉంచుతున్న వైద్యాధికారులు
గొల్లప్రోలు రూరల్, ఏప్రిల్ 22 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో డయేరియా ప్రబలింది. నా లుగు రోజుల్లో 100మందికి పైగా విరోచనాలతో బాధపడుతూ పీహెచ్‌సీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరారు. అయితే ఈ విషయాన్ని వైద్యాధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేబ్రోలులో వాం తులు విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి అధికమమవుతోంది. గ్రామంలోని మట్ల వారి వీధి, రథంబాట, కొత్తపేట, చల్లా వారి వీధి తదితర ప్రాంతాల నుంచి సుమారు 100మంది గత 4 రోజుల్లో చికిత్స నిమిత్తం చేబ్రోలు పీహెచ్‌సీకి, ప్రవేటు ఆసుపత్రులు, ఆర్‌ఎంపీల వద్దకు వచ్చా రు. ఇవేగాక గొల్లప్రోలు, పిఠాపురం, కాకినాడ లోని ప్రవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు. చేబ్రోలు పీహెచ్‌సీలోనే 50మంది వరకూ రోగులు వాంతులు, విరోచనాలతో బాధపడుతూ చికిత్స పొందారు. అయితే ఈ విషయాన్ని వైద్యాధికారులు గోప్యంగా ఉంచారు. రాష్ట్ర పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ జయకృష్ణ ప్రశ్నించగా 17 కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పగా, గొల్లప్రోలు జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు ప్రశ్నిస్తే 40 నుంచి 50 వరకూ కేసులు ఉంటాయని వైద్యాధికారి డాక్టర్ జగదీష్ చెప్ప డం గమనార్హం. పీహెచ్‌సీ ఆవరణ అంతా అప రిశుభ్రంగా ఉండటంపై వారు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఉండేది ఇలాగేనా నిలదీశారు. వందమందికి పైగా డయేరియాతో చికిత్స పొందుతుంటే గ్రామంలో ఎందుకు వైద్యబృందాలు పర్యటించడంలేదని, ఉన్నతాధికారులకు ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు. వాతావరణంలో మార్పులు, తాగునీరు కలుషితం కావడం వంటివి డయేరియా ప్రబలడానికి కారణాలుగా చెబుతున్నారు. 4రోజులుగా భారీగా కేసులు వస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.