డ్రోన్ ఆన్ డ్యూటీ!
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:35 AM
నేర పరిశోధనలో పోలీసులు సాంకేతికను జోడి స్తూ.. నేర నియంత్రణకు కృషి చేస్తున్నారు. మను షులు వెళ్లలేని ప్రదేశాలను సైతం జల్లె డపడుతు న్నారు.
డ్రోన్లతో పోలీసుల పహరా
24 గంటల పాటు అప్రమత్తం
కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ
అసాంఘిక ప్రదేశాలపై నిఘా
ర్యాలీలు, ధర్నాల్లో విధులు
రాత్రివేళల్లోనూ చూపు
(రాజమహేంద్రవరం/కాకినాడ - ఆంధ్రజ్యోతి)
పి.గన్నవరం : కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కండ్రిగపేటకు చెందిన ఆరుగురు బాల బాలికలు గత నెల 24న ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసు లకు ఫిర్యాదు చేశారు.పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా వారు పి.గన్నవరం వైపు వెళ్లినట్లు గుర్తించారు. పి.గన్నవరం పరిసర లంకగ్రామాల్లో రెండు, మూడు రోజులు సంచరించారని స్థానికులు చెప్పడంతో కోనసీమ జిల్లా పి.గన్నవరం కొత్త, పాత అక్విడెక్టులు నుంచి డ్రోన్ కెమెరా సాయంతో వారు తిరిగిన లంక గ్రామాల్లో ప్రదేశాలను పరిశీలించారు. పి.గన్నవరం మండలం యర్రం శెట్టివారిపాలెం వద్ద గుర్తించారు. గాలింపు చర్యలను స్వయంగా ఎస్పీ బి.కృష్టారావు మండల కేంద్రంలో ఉండి పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాపవరంలో ఇటీవల డ్రోన్ ఎగురవేశారు. శివారు ప్రాంతం లో పొలాల మధ్య పేకాట శిబిరం కనిపించింది. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.అక్కడే ఉన్న పలువురు ఒక్క సారిగా పోలీసులు రావడం చూసి పరుగులు తీశారు.ఇలా జిల్లా వ్యాప్తంగా రాజానగరం, రాజమహేంద్రవరంలో పలు కేసులు నమోదయ్యాయి.
కాకినాడ నగరంలోని ఎంఎస్‌ఎన్ చారిటీస్ వెనుక ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇటీవల డ్రోన్ ఎగరవేసి గంజాయి బ్యాచ్ ఆగడాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎవరికీ కనిపించకుండా శివారు ప్రాం తాల్లో గుట్టుగా అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నారు. పోలీసులు డ్రోన్ సాయంతో పట్టేసి ఉక్కు పాదం మోపుతున్నారు. వెంటాడి మరీ వేటాడుతూ పూర్తి సాక్ష్యాధారాలతో కేసులు నమోదు చేస్తున్నారు.
నేర పరిశోధనలో పోలీసులు సాంకేతికను జోడి స్తూ.. నేర నియంత్రణకు కృషి చేస్తున్నారు. మను షులు వెళ్లలేని ప్రదేశాలను సైతం జల్లె డపడుతు న్నారు. శివారు ప్రాంతాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేంతగా టెక్నాలజీని వాడుతున్నా రు. నేరాలు జరగక ముందే వాటిని పసిగట్టి నివారణ చర్యలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరాల కట్టడికి డ్రోన్ల వినియోగానికి పచ్చ జెండా ఊపింది.పోలీసు యంత్రాంగానికి డ్రోన్లు అందజేసింది. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి, జూదం, వ్యభిచారం,ఈవ్ టీజింగ్, ఆకతాయిల వికృత చేష్టలు, ట్రాఫిక్ రద్దీ వంటివి తగ్గుముఖం పట్టించే దిశ గా డ్రోన్లను వినియోగిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 31 డ్రోన్లు
కాకినాడ జిల్లాలో ఉన్న మొత్తం 28 పోలీస్ స్టేషన్లలో గతంలో కేవలం నాలుగు డ్రోన్లనే జిల్లా పోలీసులు వినియోగించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, సీఎం చంద్రబాబు నేరాల అదుపునకు సాంకేతికను జోడిం చాలని సూచించడంతో డ్రోన్ల వాడకంపై దృష్టిపెట్టారు. జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమారు 13 డ్రోన్ కెమెరాలను జిల్లా పోలీసులకు అందజేశారు. దీంతో జిల్లాలో మొ త్తం 28 పోలీసు స్టేషన్లకు ప్రస్తుతం 17 డ్రోన్లు ఉన్నా యి. తుని టౌన్, అన్న వరం, తొండంగి, ప్రత్తిపాడు, పిఠాపురం టౌన్, సర్పవరం స్టేషన్, కాకినాడ టూ టౌన్, కాకినాడ పోర్టు, కరప, ట్రాఫిక్ -1, ఇంద్రపాలెం స్టేషన్లలో ప్రస్తుతం డ్రోన్లు అందుబాటులో ఉంచారు. కాకి నాడ జిల్లాలో ఇప్పటి వరకు డ్రోన్ల ద్వారా సు మారు 100కు పైగా కేసులు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 10 డ్రోన్లు అందు బాటులో ఉన్నాయి. హెడ్ క్వార్టర్ రాజమహేం ద్రవరంలో 4, దేవరపల్లి, బొమ్మూరు, బిక్కవోలు పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కటి, నిడదవోలులో 3 ఉన్నాయి.జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషనుకూ కనీసం ఒక డ్రోన్ ఉండాలని ఎస్పీ నరసింహ కిశోర్ నిర్ణయించారు.దీంతో ప్రతి స్టేషన్‌కీ ఒకటి ఏర్పాటు చేసుకునే పనిలో అధికారులు ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్) లేదా ఇతరుల నుంచి వితరణ ద్వారా డ్రోన్లను ఏర్పా టు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా రు. పోలీస్ స్టేషన్లకు ఎవరైనా డ్రోన్లు కొనిస్తే సమాజానికి ఎంతో కొంత మేలు చేసిన వారవుతారనేది వాస్తవం. కోన సీమ జిల్లాలో 4 డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి.
6 కి.మీ పసిగట్టేస్తోంది..
ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ.2 లక్షలు..48 మెగా పిక్సెల్ కెమెరా, 4కే హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌తో పాటు రాత్రివేళల్లో కూడా 300 మీటర్ల వరకు వీడియో, ఫొటోలు క్యాప్చర్ చేయగలిగిన సామర్థ్యం ఉంది.ఇవి 500 మీటర్ల ఎత్తు ఎగరగలవు. 6 కిలోమీటర్ల దూరం ప్రయా ణించగలవు.ఒక్కో డ్రోన్‌లో 46 నిమిషాలు వచ్చే ఒక బ్యాటరీ ఉండగా.. మరో బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. లైవ్ కెమెరా ఉండడంతో వీడియో తీస్తున్న సమయంలోనే ఆ వీడియోని డ్రోన్‌కి అనుసంధానించిన సెల్‌ఫోన్, కంప్యూటర్‌లో చూడవచ్చు. కాకినాడ జిల్లాలో స్టేషన్‌కు ముగ్గురు చొప్పున 97 మంది కానిస్టేబుళ్లకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు.రెండు స్టేషన్లకు ఒకటి చొప్పున డ్రోన్లు ఉండగా..రోజుకు మూడు షిఫ్టుల వారీగా డ్రోన్లను ఎగురవేస్తున్నారు. వినియోగించే ఏర్పాట్లు చేశారు.తూర్పుగోదావరి జిల్లాలో 25 పోలీస్ స్టేషన్లు ఉండగా 150 మందికి డ్రోన్ల విని యోగంపై శిక్షణ ఇచ్చారు. ప్రతి కానిస్టేబుల్‌కి దశల వారీగా శిక్ష ణ ఇచ్చేలా చర్యలు చేపడుతు న్నారు.పలు స్టేషన్లలో డ్రోన్లు పూర్తిస్థాయిలో వినియోగించడం లేద ని తెలుస్తోంది. అదే జరిగితే బ్యాటరీలు డెడ్ అయిపోవడం, సాం కేతిక లోపాలు తలెత్తడం తదితర సమస్యలు వస్తాయి.
గాలిలో నిఘా నేత్రం...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్టేషన్ల వారీగా అసాం ఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను పోలీసులు గుర్తించారు.ఆ ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేసి.. అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలను చిత్రీకరిస్తున్నారు. శిక్షణ పొందిన కానిస్టేబుల్ డ్రోన్ ఎగిరే సమయంలో కనిపించే దృశ్యాలు, వ్యక్తులు, ఆయా స్థావరాలను గుర్తించి అక్కడికి పోలీసు బృందాలను పంపుతున్నారు.వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు.ఇటీవల పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జిల్లా పోలీసు యంత్రాంగం డ్రోన్లను వినియోగించింది.జాతరలు, ర్యాలీలు, ఉత్స వాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
ఇంకా అవసరం
జిల్లాలో డ్రోన్ల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది.గోదావరి పుష్కరాలు సమీ పిస్తుండడంతో పోలీ సులకు డ్రోన్లు అత్యంత ముఖ్యమైన ఉపకరణా లుగా ఉంటాయి.తూర్పుగోదావరి,కోనసీమ జిల్లాల్లో గోదా వరి పరీవాహక ప్రాంతం విస్తారంగా ఉంది. గోదావ రిలో ఇసుక మేటలు వేసిన చోట లంకల్లా ఏర్పడ్డా యి.ఆ లంకలు ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డా లు గా మారుతున్నాయి. అక్కడికి పోలీసులు వెళ్లా లంటే కష్టమే. డ్రోన్లుతో నిరంతరం పర్యవేక్షించే అవ కాశం ఉంటుంది. ఆ దిశగా పోలీసులు ఇప్పటి నుంచే లంక లపై దృష్టి సారించాల్సి ఉంది.డ్రోన్లను చాలా రకాలు గా ఉపయోగించుకోవచ్చు.ఇప్పటికే విశాఖ వంటి నగరాల్లో డ్రోన్లను ఉపయోగించి హెల్మెట్ ధరించక పోవడం,సిగ్నల్ జంపింగ్, నెంబర్ ప్లేట్లు లేకపోవడం, రాంగ్‌పార్కింగ్ వంటివాటికి చలానాలు విధిస్తున్నారు.
నేరాల అదుపులో కీలకం..
నేరాల అదుపునకు టెక్నాలజీని వినియోగిసున్నాం. డ్రోన్ల వినియోగం ద్వారా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ, అసాంఘిక కార్యకలాపాలు జరకుండా చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి, బహిరంగ మద్యపానం, ఈవ్ టీజింగ్, ట్రాఫిక్ రద్దీ సమస్యలు, జన సంచారం అధికంగా ఉండే చోట్ల పరిస్థితులను గమనించి ఆయా స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేస్తూ.. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాం.
- బిందుమాధవ్, ఎస్పీ, కాకినాడ జిల్లా