Share News

రె..డీఎస్సీ!

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:45 AM

ఉపాధ్యాయ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో నేడో రేపో నోటిఫికేషన్‌ విడుదలకానుం ది.

రె..డీఎస్సీ!

నెరవేరనున్న కూటమి మరో హామీ

ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆనందం

ఉమ్మడి జిల్లాలో 95 వేల మంది పైనే

42 నుంచి 44 ఏళ్లకు పెంపు

వయోపరిమితి పెంపుతో ఊరట

ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్‌ జారీ

సమాయత్తమవుతున్న విద్యాశాఖ

కాకినాడ రూరల్‌/ అమలాపురం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో నేడో రేపో నోటిఫికేషన్‌ విడుదలకానుం ది. ఈనేపథ్యంలో ఎప్పటి నుంచో డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అడ్డంకులు దాటుకుని..

రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటూ ఉపాధ్యా య ఉద్యోగాల భర్తీని విస్మరించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347కు పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను నిర్వహించి నవంబరులోనే ఫలితాలు ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాలు, ఎమ్మెల్సీ కోడ్‌ అమలు, అభ్యర్థుల వయోపరిమితి పెంపు తదితర సమస్యలపై స్పష్టమైన నిర్ణయం రావాల్సి ఉన్నందు న డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల సీఎం చంద్రబాబు, విద్యా శాఖామంత్రి నారా లోకేశ్‌ అసెంబ్లీ, శాసనమం డలి సమావేశాల్లో ఏప్రిల్‌లోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టుల భర్తీని జూన్‌ కల్లా పూర్తిచేస్తామని ప్రకటించడంతో అభ్యర్థు లు నోటిఫికేషన్‌కు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 20 లేదా 23న డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందని తెలిసి హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 95 వేల మం దికిపైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

వైసీపీ తెచ్చిన తంటా..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా స్కూలు అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులు మొత్తం కలిపి 1026 ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో అమలాపురం ఉప విద్యాశాఖాధికారి పరిధిలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి 908 ఖాళీలను గుర్తించినట్టు అధికారులు నిర్ధారించారు. ఇంకా జిల్లాలో కొత్తపేట, రామచంద్రపురం సబ్‌ డివిజన్ల పరిధిలో ఖాళీల సంఖ్య తేలాల్సి ఉంది. అయితే ప్రభు త్వానికి నివేదించిన జాబితాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోస్టుల సంఖ్య భారీగా కుదించి నివేదించినట్టు ఉపాధ్యాయ సంఘాల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్జీటీ పోస్టులు రద్దుచేసి వారిని వేరే పోస్టులకు కేటాయించారు. ఆ పరిస్థితుల కారణంగా ఇప్పటికీ ఎస్జీటీ పోస్టుల ఖాళీలపై స్పష్టత లేదని వారు ఆరోపిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వంలో ఎయిడెడ్‌ పోస్టులను రద్దు చేసి ఆయా పాఠశాలలను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్‌కు నిరుద్యోగ యువకులు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. పోస్టుల్లో కోత విధిస్తే తమకు ఏమాత్రం ప్రయోజనం ఉండదనేది వారి ఆవేదన.

1278 పోస్టులు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 1,278 ఉపాధ్యాయ ఉద్యోగాలను డీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నట్టు సమాచారం. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఆంగ్లం 90, తెలుగు 70, హిందీ 71, గణితం 55, ఫిజికల్‌ సైన్స్‌ 59, బయోలాజికల్‌ సైన్స్‌ 95, సోషల్‌ స్టడీస్‌ 114, సంస్కృతం 5, వ్యాయా మ విద్య 199, ఎస్జీటీలు 349, పీజీటీ, టీజీటీ ప్రిన్సిపాల్స్‌ మొత్తం 171 ఖాళీలు డీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నట్టు తెలిసింది.

ప్రత్యేక విద్యకు 288 పోస్టులు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక విద్యకు సంబంధించి 151 స్కూల్‌ అసిస్టెంట్లు, 137 ఎస్జీటీ ఉపాధ్యాయ ఉద్యో గాలు భర్తీకానున్నాయి. వారంరోజుల్లోపు డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్న ట్టు సమాచారం.ఈ మేరకు విడిగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన 45 రోజుల తరువాత పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.

వయోపరిమితి 44 ఏళ్లు

డీఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితిని సడలిస్తూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు కాగా దానిని 44 ఏళ్లకు పెంచారు. 2024 జూలై 1ని కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు.ఈ సడలింపు ఈ ఒక్క డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందన్నారు.

ఫఏపీ ఎస్సీ కులాల ఉపవర్గీకరణ ఆర్డి నెన్స్‌-25 జారీచేశారు. దీని ప్రకారం 3 ఎస్సీగ్రూపుల విషయంలో 200 రోస్టర్‌ పాయింట్ల విధానాన్ని అవలంబించనున్నారు. దీంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి వర్గీకరణ ఆర్డినెన్స్‌తో మార్గం సుగమమైంది.

Updated Date - Apr 19 , 2025 | 12:45 AM