Share News

సమయపాలన తప్పనిసరి

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:56 AM

ప్రభుత్వ బోధనాసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సింగ్‌ స్టాఫ్‌, వైద్యసిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిని కలెక్టర్‌ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్రిటికల్‌ కేర్‌ భవనం, మాతా శిశు సంరక్షణ బ్లాకు, ఇతర విభాగాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు.

 సమయపాలన తప్పనిసరి
ప్రభుత్వ బోధనాసుపత్రి తనిఖీలో కలెక్టర్‌ ప్రశాంతి

క్రిటికల్‌ కేర్‌ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ప్రభుత్వ బోధనాసుపత్రి తనిఖీలో కలెక్టర్‌ ప్రశాంతి

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బోధనాసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సింగ్‌ స్టాఫ్‌, వైద్యసిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిని కలెక్టర్‌ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్రిటికల్‌ కేర్‌ భవనం, మాతా శిశు సంరక్షణ బ్లాకు, ఇతర విభాగాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రధాన వైద్యులతో మాట్లాడారు. నర్సింగ్‌ స్టాఫ్‌, ఇతర సిబ్బందితో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, మానవ వనరుల వివరాలను తెలుసుకున్నారు. క్రిటికల్‌ కేర్‌ బ్లాకు పనుల పురోగతిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీసూర్యప్రభను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోధనాసుపత్రికి అనుసంధానంగా నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ భవనం పనులు మరింత వేగవంతం చేయాలని, ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు వీలుగా సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఐసోలేషన్‌ వార్డును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పలువురు వైద్యులు, ఇంనీరింగ్‌ అధికారులు కలెక్టర్‌ వెంట ఉన్నారు.

  • అసంబద్ధ ఎండార్స్‌మెంట్లు ఇవ్వొద్దు

రాజమహేంద్రవరం రూరల్‌, ఏప్రిల్‌ 21(ఆం ధ్రజ్యోతి): అర్జీల పరిష్కారం విషయంలో కంటెంట్‌లకు సంబంధించి అసంబద్ధ ఎండార్స్‌ మెంట్లు ఇవ్వడం సరికాదని, బాధ్యతలు సక్రమంగా నిర్వహించినట్టు కాదని కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలు ఆమె స్వీకరించారు. అదే సమయంలో జూమ్‌కాన్ఫరెన్స్‌ ద్వారా అర్జీల పరిష్కార విధానంపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం, వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా వస్తున్న అర్జీలను స్వీకరిచండం వాటికి తగిన విధంగా పరిష్కారం చూపాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ చిన్నరాముడు, డీఆర్వో టి.సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:56 AM