థాంక్యూ..సీఎం సార్!
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:23 AM
ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సం దర్భంగా ప్రత్యేక కానుక ఇచ్చారు. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదివారం విడుదల చేశారు
మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఉమ్మడి జిల్లాలో 1241 పోస్టులు
ఏడేళ్ల తర్వాత విడుదల
గత వైసీపీలో ఆ ఊసే లేదు
అభ్యర్థుల ఆనందం
(కాకినాడ, ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సం దర్భంగా ప్రత్యేక కానుక ఇచ్చారు. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదివారం విడుదల చేశారు.గత ఏడేళ్లుగా ఈ ప్రకటన కోసం ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు ఎదు రుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16,437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టులు 1241 భర్తీ చేయనుంది. వాస్తవానికి 2018లో డీఎస్సీ చివరి నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత అధి కారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సుమారు ఆరు వేల పైచిలుకు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.
దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉండ డంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారు డీఎస్సీ పరీక్ష నిర్వహించలేదు. ఇంతలో ఎన్నికలు కోడ్ అమల్లోకి రావడంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడి ంది. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్‌పై సంతకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే.. సీఎం చంద్రబాబు ఆయన జన్మదినం రోజున డీఎస్సీ నోటిఫికేషన్‌పై విడుదల చేయడంపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
‘బాబు ష్యూరిటీ.. జాబు గ్యారంటీ’ అని డీఎస్సీ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1241 ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి తెలుగు 65, ఫిజికల్ సైన్స్ 71, బయోలాజికల్ సైన్స్ 103, సోషల్ స్టడీస్ 132, వ్యాయామ విద్య 210, ఎస్జీటీలు డీఎస్సీ ద్వారా భర్తీ కానున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్‌కు సంబంధించి ఫిజికల్ సైన్స్ 3, బయోలాజికల్ సైన్స్ 4, స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య 1 ఎస్టీటీలు 104, మొత్తం 112 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రత్యేక విద్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 13 టీజీటీలు, మూడు పీఈ టీలు, 15 ఎస్‌జీటీలతో కలిపి మొత్తం 31 పోస్టులు భర్తీకానున్నాయి.డీఎస్సీ అభ్య ర్థులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అట్లాంటాలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు
భారత్ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు
For More AP News and Telugu News