నాలుగు నెలల్లో ఇళ్ల పట్టాలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:05 AM
రాజమహేంద్రవరంలో 9వేల మందికి నాలుగు నెలల్లో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
వాంబే గృహ లబ్ధిదారులకు పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే వాసు
రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 22(ఆంధ్ర జ్యోతి): రాజమహేంద్రవరంలో 9వేల మందికి నాలుగు నెలల్లో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 6వ డివిజన్ గొల్లవీధిలో 33 మంది వాంబేగృహాల లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్ల పంపిణీ మంగళవారం రాత్రి జరిగింది. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన, డివిజన్ ఇన్‌చార్జి మజ్జి మణికంఠ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, కాశి నవీన్‌కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా వాంబే గృహాల్లో నివసిస్తున్న 33 మంది లబ్ధిదారులకు పట్టాలు లేకపోవడం విచారకరమన్నారు. వైసీపీ వారికి ఈసంగతి తెలి సుంటే ఈ లబ్ధిదారులను ఖాళీ చేయించి వారి మనుషులకు ఇచ్చుకునేవారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక అందరికి న్యాయం చేసేం దుకు చర్యలు చేపట్టామన్నారు. మిగిలిన వారికి కూడా పరిశీలన పూర్తయ్యాక అందజేస్తామని హామీ ఇచ్చారు. 45వ డివిజన్ రాజీవ్‌గాంధీనగర్, 49 డివిజన్ సింహచల్ నగర్, సుబ్బారావు నగర్ ప్రాంతాల్లో అవసరమైన వారికి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన డివైడర్లు, పుట్‌పాత్ పను ల్లో అవినీతి జరిగిందన్నారు. నిందితులను వదిలేది లేదన్నా రు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్థానిక 33వ డివిజన్‌కు చెందిన పార్టీ కార్యకర్త పొన్నాడ వెంకట రవికుమార్ ఇటీవల మృతిచెందారు. దీంతో పార్టీ తరపున కట్టిన బీమా నగదు రూ.5 లక్షలను రవికుమార్ సతీమణి వనిత బ్యాంక్ ఖాతాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జమచేయించి ఒక లేటర్‌ను పంపించారు. ఈ సందర్భంగా బాధితులకు ఆ లేటర్‌ను ఎమ్మెల్యే వాసు అందించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన ప్రతీ కార్యకర్తకు టీడీపీ అండగా వుంటుందని, కార్యకర్తల సంక్షేమం, శ్రేయస్సు కోసం పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో కాశి నవీన్‌కుమార్, మరుకుర్తి రవియాదవ్, హరిబెనర్జీ, సాల్మన్‌రాజు, శ్యామ్, దుత్తరపు గంగాధర్, నేమాలి శ్రీను పాల్గొన్నారు.