రెండో ఉచిత సిలిండర్‌కు క్యూ..
ABN , Publish Date - Apr 19 , 2025 | 01:34 AM
కలెక్టరేట్(కాకినాడ), ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): రెండో ఉచిత సిలిండర్‌కు లబ్ధిదారులు క్యూకడుతున్నారు. వేగంగా బుకింగ్‌లు చేసుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిరోజు పెద్దఎత్తున బుకింగ్స్ జరుగుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో సుమారు 13 లక్షల మంది గ్యాస్ వినియోగదారు
ఉమ్మడి జిల్లాలో వినియోగదారులు 13 లక్షలు
2,82,198 మంది గ్యాస్ బుకింగ్
1,09,592 మంది ఖాతాల్లో సొమ్ము జమ
కలెక్టరేట్(కాకినాడ), ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): రెండో ఉచిత సిలిండర్‌కు లబ్ధిదారులు క్యూకడుతున్నారు. వేగంగా బుకింగ్‌లు చేసుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిరోజు పెద్దఎత్తున బుకింగ్స్ జరుగుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో సుమారు 13 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి రెండో ఉచిత గ్యాస్ సిలిం డర్ బుకింగ్ ఆరంభమైంది. ఇప్పటివరకు 2,82,198 మంది విని యోగదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా 1,09,592 మంది బ్యాంకు ఖాతాల్లోకి రూ.8.72 కోట్లు సబ్సిడీ సొమ్ము జమ అయింది. మిగిలిన వినియోగదారులకు మరో నాలుగు రోజుల్లో రాయితీ సొమ్ములు జమచేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో 91,382 మంది గ్యాస్ సిలిండర్లకు బుక్ చేసుకోగా 34,645 మంది వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.2.74 కోట్లు జమ అయిం ది. కాకినాడ జిల్లాలో 1,03,832 మంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోగా, 41,223 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.3.27 కోట్ల రాయితీ సొమ్ము జమచేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లాలో 86,984 మంది వినియోగదారులు గ్యాస్ సిలిం డర్లకు బుక్ చేసుకోగా, 33,724 మందికి రూ.2.70 కోట్ల రాయితీ సొమ్ము జమచేశారు. వినియోగదారులు రెండో గ్యాస్ సిలిండ ర్‌ను ఈ ఏడాది జూలై 31వ తేదీలోపు బుక్ చేసుకోవాలని నిబం ధన విధించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ దీపం-2 పథకానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తొలి విడత, రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసుకున్న వినియోగ దారులకు ఏదైనా కారణాల వల్ల రాయితీ సొమ్ము బ్యాంకు ఖాతా ల్లో జమకాకపోతే ఆయా జిల్లాల పౌరసరఫరాల శాఖ కార్యాల యాల్లో సంప్రదించాలని సంబంధిత అధికారులు వెల్లడించారు.