Share News

అందాల రాక్షసివే..

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:42 AM

అందాల కశ్మీరం.. ఉగ్రదాడితో కాష్మోరాగా మారిపోయింది.. కాష్మోరా సినిమా చూడాలంటేనే భయపడినట్టు.. ప్రస్తుతం కశ్మీరం వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.. వేసవి సెలవుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న వందలాదిమంది తమ టూర్‌ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు.. ఆ అందాల రాక్షసిని తిలకించాలంటే ముందు మేం ఉండాలి కదా.. అంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు..

అందాల రాక్షసివే..
మంచుకొండల్లోన సంద్రమా : కశ్మీర్‌ సోనామార్గ్‌లో గురువారం మంచు ఇలా..

  • కశ్మీర్‌..టెర్రర్‌

  • ఉగ్రవాదుల దుశ్చర్య

  • పర్యాటకుల్లో గుబులు

  • పలు బుకింగ్‌లు రద్దు

  • టూర్‌ ఏజెన్సీల గగ్గోలు

  • కొంత మంది ఢిల్లీకి పయనం

  • అక్కడ చిక్కిన టూరిస్ట్‌లు

  • తిరిగి వచ్చేందుకు ఒత్తిడి

  • ఖాళీ అవుతున్న కశ్మీరం

అందాల కశ్మీరం.. ఉగ్రదాడితో కాష్మోరాగా మారిపోయింది.. కాష్మోరా సినిమా చూడాలంటేనే భయపడినట్టు.. ప్రస్తుతం కశ్మీరం వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.. వేసవి సెలవుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న వందలాదిమంది తమ టూర్‌ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు.. ఆ అందాల రాక్షసిని తిలకించాలంటే ముందు మేం ఉండాలి కదా.. అంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.. -కాకినాడ,ఆంధ్రజ్యోతి

రాజమహేంద్రవరంలో ఓ వ్యాపారి వేసవి సెలవుల్లో కుటుంబంతో సహా కశ్మీర్‌ వెళ్లాలని ముందే ప్లాన్‌ చేశారు. ఆరుగురి కోసం ముందే ఫ్లైట్‌ టిక్కెట్స్‌, హోటల్స్‌ బుక్‌ చేసుకున్నారు. తీరా కశ్మీర్‌లో ఉగ్రవాదులు సృష్టించిన నరమేథంతో అక్కడకు వెళ్లలేక టూర్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారు.

కాకినాడలో రెవెన్యూశాఖకు చెందిన ఆరుగురు ఉద్యోగులు సెలవుపెట్టి కశ్మీర్‌కు బయలుదేరారు. తీరా ఢిల్లీలో విమానం దిగి ఉదయాన్నే కశ్మీర్‌కు బయలుదేరాల నుకునేలోగా ఉగ్రవాదుల దుశ్చర్యతో కాశ్మీర్‌ ట్రిప్‌ రద్దు చేసుకున్నారు. తిరుగు విమానం టికెట్లు ఈనెల 26వ తేదీకి బుక్‌ చేయడంతో చేసేదిలేక ఢిల్లీలోనే ఉండిపోయారు. మూడురోజులుగా ఢిల్లీలోనే ఉండిపోయి చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతున్నారు.

కశ్మీర్‌లో ఉగ్రవాద దుశ్చర్య జరగడానికి ఐదు రోజుల ముందే అక్కడి నుంచి కాకినాడకు వచ్చిన కొందరు పర్యాటకులు జరిగిన సంఘటన తల్చుకుని బెంబేలెత్తిపోతున్నారు. తాము పహల్గాం నుంచి బైరసన్‌కు గుర్రాల్లో వెళ్లామని, అదే ప్రాంతంలో నరమేథం జరిగిందని తెలిసి ఒళ్లు జలదరించిందని కాకినాడ నగరానికి చెందిన కొందరు పర్యాటకులు వివరించారు.

కశ్మీర్‌లోయలోని పహల్గాంలో ఈనెల 22న 26మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టు కున్న నేపథ్యంలో కశ్మీర్‌లో ఉన్న పర్యాటకులు ప్రాణభయంతో తిరుగుముఖం పట్టారు. దీంతో చాలావరకు కశ్మీర్‌ ఖాళీ అయిపోయింది. మరో పక్క అక్కడకు సరదాగా వెళ్లాలని ముందే ప్లాన్‌ చేసుకున్న అనేక కుటుంబాలు ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నాయి. ఈ వేసవిలో సర దాగా కశ్మీర్‌ వెళ్లడానికి ఉమ్మడి జిల్లాలో పలు కుటుంబాలు టూర్‌ ఏజెంట్లను సంప్రదించి నెల రోజులు ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకున్నా రు. ఇప్పుడు ఉగ్రవాదుల దుశ్చర్యతో కశ్మీర్‌కు వెళ్లాలనుకున్న పర్యాటకులు రద్దు చేసుకుంటు న్నారు. దీంతో ఏజెంట్లు గగ్గోలు పెడుతున్నారు.

బుకింగ్‌లు రద్దు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల నుంచి దేశ, విదే శాల్లో వివిధ టూరిస్ట్‌ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకుల కోసం 75 వరకు టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఏజె న్సీలున్నాయి. స్వదేశంలో ఏర్పాట్లకు 42 వరకు సర్వీసులు అందిస్తున్నాయి. ఈనెల, వచ్చే నెలలో కలిపి ఈ రెండు నగరాల నుంచి దాదాపు 170 వరకు వివిధ కుటుంబాలు, గ్రూపులు ఢిల్లీ, కశ్మీ ర్‌కు బుకింగ్‌లు చేసుకున్నాయి. కానీ ప్రస్తుతం అక్కడకు వెళ్లడం ప్రమాదంతో కూడుకున్నం దున వీరంతా తమ పర్యటనలను రద్దు చేసు కుంటున్నారు. కొందరైతే ఆన్‌లైన్‌లో సొంతంగా చేసుకున్న బుకింగ్‌లు రద్దు చేసుకుంటున్నట్టు కాకినాడ, రాజమహేంద్రవరానికి చెందిన రెండు టూర్‌ ఏజెన్సీలు వివరించాయి. ఉమ్మడి జిల్లాలో కశ్మీర్‌ టూర్‌కు టికెట్లు బుక్‌ చేసుకున్న పర్యాట కులకు హోటల్స్‌ బుకింగ్‌ రద్దుకు అంగీకరించగా, కొన్ని విమాన కంపెనీలు టికెట్‌ బుకింగ్‌ ఆప్షన్‌లో క్యాన్సిలేషన్‌ లేదేని తెగేసి చెబుతున్నాయి. కశ్మీర్‌ వెళ్లేవారంతా ఢిల్లీ నుంచే రైళ్లలోను, విమానాల్లోనూ వెళతారు. దీంతో కొందరు డబ్బు లు వదిలేసుకుని పర్యటన రద్దు చేసుకోగా.. కొందరు పర్యాటకులైతే డబ్బులు వదులుకోలేక ఢిల్లీ వరకు వెళ్లి కొన్నిరోజులు ఉండేలా సిద్ధమవుతున్నారు. ఇలా కొందరు పర్యాటకులు ఈనెల 26, 27 తేదీల్లో పయనమవుతున్నట్టు రాజమహేంద్రవరానికి చెందిన ట్రావెల్‌ ఏజెన్సీ వివరించింది. ఇప్పటికే శ్రీనగర్‌లో ఉన్న పర్యాటకులు వెనక్కు రావడానికి విమానం టిక్కెట్లు బుక్‌ చేయాలని, లేదా ఢిల్లీ దాకా తెలిసిన టూర్‌ ఏజెన్సీ వాహ నా లు బుక్‌చేయాలని కోరుతున్నట్టు సమాచారం.

వేసవిలో వెళ్లేది ఇందుకే..

ఏప్రిల్‌లో మనకు ఎండలు మండిపోతుంటాయి. 38 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రత ఉంటుంది. కశ్మీర్‌లో పగటి ఉష్ణోగ్రత 5 నుంచి 13 డిగ్రీల వరకు ఉంటుంది. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అనేక చోట్ల మైనస్‌ 3 డిగ్రీలు ఉంటుంది. గురు వారం కశ్మీర్‌లోని సోనామార్గ్‌లో రాత్రి 8 గంట లకు ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు నమోదైంది. బుధ వారం అయితే రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మైనస్‌ 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉగ్రవాద దుశ్చర్య జరిగిన పహల్గాంలోని బైస రన్‌లో గురువారం రాత్రి రెండు డిగ్రీలు ఉష్ణోగ్ర త నమోదైంది. కశ్మీర్‌లో అనేకచోట్ల పగటి ఉష్ణో గ్రతలు సైతం ఆరు నుంచి ఎనిమిది డిగ్రీలే ఉం టోంది. ప్రకృతి అందాలు, హిమాలయ సోయ గాలు ఈ సమయంలో ఎంతగానో అలరిస్తాయి. దీంతో కశ్మీర్‌కు బుకింగ్‌లు ఎక్కువ ఉంటాయి.

కశ్మీర్‌కు ఇప్పుడే ఎందుకంటే..

జమ్ముకశ్మీర్‌ ఏప్రిల్‌ నుంచి మరింత అందంగా మారుతుంది. ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తుంది. మార్చి మూడో వారం వరకు కశ్మీర్‌లోని శ్రీనగర్‌, పహల్గాం, గుల్మార్గ్‌, సోనామార్గ్‌, దాల్‌ లేక్‌ ప్రాంతాల్లో మంచు కురుస్తుంటుంది. మార్చి ఆఖరు నుంచి.. ఏప్రిల్‌ ఆరంభంలో మంచు కురవడం ఆగిపోయి వందల మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన భారీ మంచు కొండలు కరగడం మొదలవుతాయి. ఈ సమయంలో హిమా లయాలు, దాల్‌ లేక్‌లో పడవ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. అందుకే ఈ సమయంలో పర్యాటకులు దేశవ్యాప్తంగా కశ్మీర్‌కు పోటెత్తుతారు. ప్రతి ఏడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ సీజన్‌లో కశ్మీ ర్‌కు గ్రూపు బుకింగ్‌లు ఎక్కువ ఉంటాయి.

Updated Date - Apr 25 , 2025 | 12:42 AM