Share News

జేఎన్టీయూకేను రోల్‌ మోడల్‌గా నిలిపేందుకు కృషి

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:14 AM

జేఎన్టీయూకే, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌-2047, వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌-2047 మాదిరిగా వికసిత్‌ జేఎన్టీయూకే-2047కు అను గుణంగా రోడ్‌ మ్యాప్‌ తయారుచేసి జేఎన్టీయూకేను దేశంలోని విద్యాసంస్థలకు రోల్‌ మో డల్‌గా నిలిపేందుకు కృషి చేయనున్నట్టు ఉప కులపతి ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ పేర్కొ న్నారు. వర్శిటీలోని యూసీఈకే సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో సౌధా-2కె25 పేరు తో 2 రోజుల పాటు ఓఎస్డీ డి.కోటేశ్వరరావు అ ధ్యక్షతన నిర్వహించిన జాతీయస్థాయి సింపోజియం టెక్‌ఫెస్ట్‌ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్కే.ప్రసా

జేఎన్టీయూకేను రోల్‌ మోడల్‌గా నిలిపేందుకు కృషి
ప్రభాకరరావుకు జ్ఞాపిక అందజేస్తున్న వీసీ

వీసీ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌

జేఎన్టీయూకే, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌-2047, వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌-2047 మాదిరిగా వికసిత్‌ జేఎన్టీయూకే-2047కు అను గుణంగా రోడ్‌ మ్యాప్‌ తయారుచేసి జేఎన్టీయూకేను దేశంలోని విద్యాసంస్థలకు రోల్‌ మో డల్‌గా నిలిపేందుకు కృషి చేయనున్నట్టు ఉప కులపతి ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ పేర్కొ న్నారు. వర్శిటీలోని యూసీఈకే సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో సౌధా-2కె25 పేరు తో 2 రోజుల పాటు ఓఎస్డీ డి.కోటేశ్వరరావు అ ధ్యక్షతన నిర్వహించిన జాతీయస్థాయి సింపోజియం టెక్‌ఫెస్ట్‌ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్కే.ప్రసాద్‌, విశిష్ట అతిథిగా పూర్వ విద్యార్థి, విశ్రాంత కల్నల్‌ ఎంఎస్‌.ప్రభాకరరావు హాజరయ్యారు. వీసీ మాట్లాడుతూ వినూత్న కార్యక్రమాలు, నూతన ఆలోచనలకు ఇటువంటివి మంచి వేదికగా నిలుస్తాయన్నారు. ప్రభాకరరావు మాట్లాడుతూ వర్శిటీ నుంచి ఎంతోమంది పూర్వ విద్యార్థులు త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవచేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత ఇంజనీరింగ్‌ విద్యార్థులు కూడా దేశానికి సేవచేసేందుకు త్రివిధ దళాల్లో చేరాలని సూచించారు. సింపోజియంలో భాగం గా విద్యార్థులకు నిర్వహించిన పేపర్‌, పోస్టర్‌ ప్రజంటేషన్‌, డ్రోన్‌ ప్రజంటేషన్‌, స్పాట్‌ ఈవెం ట్స్‌, టెక్నికల్‌ క్విజ్‌ తదితర పోటీల్లో విజేతలకు, పాల్గొన్న విద్యార్థులకు అతిఽథులు బహుమతులు, ప్రతిభాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సీఈ శ్రీనివాసులు, డైరెక్టర్లు, విభాగాధిపతులు, జేవీఆర్‌ మూర్తి, రామ్‌ప్రసాద్‌, రాజ్‌కుమార్‌,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:14 AM