Share News

పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో వేగం ఏది?

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:24 AM

అన్నవరం/కిర్లంపూడి, ఏప్రిల్‌ 23 (ఆంధ్ర జ్యోతి): పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తికి లక్ష్యాలు నిర్దేశించినా అనుకున్నంత వేగం కనిపించడంలేదని జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా అన్నవరంలో బుధవారం జరిగిన సమా వేశంలో ఆయన మా

పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో వేగం ఏది?
అన్నవరంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

స్థానిక సమస్యల నెపంతో కాలయాపన

మంత్రి నిమ్మల ధ్వజం

అన్నవరం/కిర్లంపూడి, ఏప్రిల్‌ 23 (ఆంధ్ర జ్యోతి): పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తికి లక్ష్యాలు నిర్దేశించినా అనుకున్నంత వేగం కనిపించడంలేదని జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా అన్నవరంలో బుధవారం జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యలు సాకు చూపి కాలయాపన చేస్తున్నట్టు గుర్తించానని వీటి పరిష్కార బాధ్యత స్థానిక శాసనసభ్యులు, మంత్రులతో చర్చించి పనులు పూర్తిచేయాలన్నారు. 2024 నవంబరులో పనులు అప్పగించినా తగినంత యాంత్రీకరణ, మ్యాన్‌పవర్‌ లేదని త్వరితగతిన సమకూర్చుకోవాల న్నారు. పనుల కాంట్రాక్ట్‌లు విడివిడిగా టెండర్లు పిలిచినా నాలుగైదు ఫేజ్‌లు ఒకేసంస్థ నిర్వహిస్తుందని అయితే పనులు వేగవంతం చేయకపోతే కాంట్రక్టర్లపై చర్యలు తీసుకోవడమే కాకు ండా అధికారులను బాధ్యులను చేయడం జరుగుతుందన్నారు. ఎండాకాలంలోనే పనులు వేగవంతం చేయకపోతే వర్షాలు పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అంతకముందు బెండపూడి సమీపంలో పంపా ప్రాజెక్ట్‌ మద్యలో నిర్మిస్తున్న ఆక్విడెక్ట్‌ పనులను పరిశీలించారు. అలా గే కిర్ల్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో పోలవరం ఎడమ కాలువ పీకేజీ 3 పనులను మంత్రి పరిశీలించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యో తుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌, ఎస్వీఎస్‌ అప్పలరాజు, ఎంపీపీ తోట రవి,తోట గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:24 AM