దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజలకు రూ.5 లక్షల విలువైన వైద్యం
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:26 AM
కడియం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు రూ.5 లక్షల విలువైన వైద్యం అందించేలా ఆయుష్మాన్‌భవ, ప్రతీ గ్రామానికి సురక్షితమైన తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వాటర్‌ట్యాంకుల ఏర్పాటుతో పాటు ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే విధంగా జలజీవన్ మిషన్ పథకాలను కేంద్రప్రభుత్వం అమలుచేస్తుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కడియపుసావరం
రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి
కడియం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు రూ.5 లక్షల విలువైన వైద్యం అందించేలా ఆయుష్మాన్‌భవ, ప్రతీ గ్రామానికి సురక్షితమైన తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వాటర్‌ట్యాంకుల ఏర్పాటుతో పాటు ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే విధంగా జలజీవన్ మిషన్ పథకాలను కేంద్రప్రభుత్వం అమలుచేస్తుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కడియపుసావరంలో నిర్మించిన సచివాలయం, 2 వాటర్ ట్యాంకులు, పేపరుమిల్లు సమకూర్చిన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి పురందేశ్వరి ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.11వేల కోట్లు ఇస్తుందన్నారు. అందు లో భాగంగానే రూ.4,285 కోట్లు కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. పో లవరం నిర్మాణానికి రూ.12,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన కాకుండా లాభా ల్లోకి తీసుకురావాలనే విషయం మీద దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలకు వారి పరిధిలో సుమారు 150 నుంచి 200 గ్రామాలు ఉంటా యని, అదే ఎంపీకి వారి పరిధిలో సుమా రు 1000 గ్రామాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యేల సహకారంతో స్థానికంగా సమస్యలు గుర్తిం చాల ని ఆ సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిదిలో ఆయా శాఖల మంత్రులతో చర్చించి పరిష్కరించి అభివృద్ధి చేయడానికి కృషి చేయవచ్చన్నారు. పేపరుమిల్లు ఈడీ ముఖేష్‌జైన్, సీఎస్ బి.విజయ్‌కుమార్ మాట్లాడుతూ రూ. 2,900 కోట్లతో పరిశ్రమను విస్తరిస్తున్నట్టు తెలిపారు. సర్పంచ్ చెక్కపల్లి మురళీకృష్ణ, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, ప్రత్తిపాటి రామారావుచౌదరి, వరగోగుల వెంకటేశ్వరరావు, వెలుగుబంటి నాని, ఆకుల శ్రీధర్, బొర్సు సుబ్రహ్మణ్యం, వరగోగుల సత్యనారాయణ, సీఎ స్‌ఆర్ మేనేజర్ దాసరి తాతారావు పాల్గొన్నారు.