వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:43 AM
పెద్దాపురం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ రెండో వైస్ చైర్‌పర్సన్ కనకాల మహాలక్ష్మి, ఆమె భర్త సుబ్రహ్మణ్యేశ్వరరావు, కుమారుడు శ్రీకాంత్ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల నేఫథ్యంలో వారు ఈ ఘటన కు పాల్పడినట్టు తెలుస్తోంది. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక సూసైడ్‌నోట్ రాసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పరిస్థితిని గమ
పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
పెద్దాపురం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ రెండో వైస్ చైర్‌పర్సన్ కనకాల మహాలక్ష్మి, ఆమె భర్త సుబ్రహ్మణ్యేశ్వరరావు, కుమారుడు శ్రీకాంత్ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల నేఫథ్యంలో వారు ఈ ఘటన కు పాల్పడినట్టు తెలుస్తోంది. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక సూసైడ్‌నోట్ రాసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పరిస్థితిని గమనించిన ఇంట్లో పనివారు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి వైద్యం అందించారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మహాలక్ష్మి కుటుం బం గతేడాది జూన్‌లో వైసీపీకి రాజీనామా చేసింది. ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరలేదు. మహాలక్ష్మి ప్రస్తుతం పెద్దాపురం మున్సిపల్ రెండో వైస్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతుండగా ఆమె భర్త సుబ్రహ్మణ్యేశ్వరావు, కుమారుడు శ్రీకాంత్ పట్టణంలో మండపేట స్వీట్‌మార్ట్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి రాజాసూరిబాబురాజు ఆసుప త్రికి వెళ్లి మహాలక్ష్మి కుటుంబీకులను పరామ ర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.