Share News

గింజుకున్నా కొనరే!

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:57 AM

జిల్లాలో రబీ ధాన్యం సేకరణ తీరు అన్నదాతలను నిలువునా ముంచేసేలా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ రైతు సేవా కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అధికా రులు అదిగో ఇదిగో అంటూ అన్నదాతలను ముప్పుతిప్ప లు పెడుతున్నారు. తొంభైశాతం మంది మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేసినా ఇంకా ఇవ్వకపోవడం వల్లే కొను గోళ్లు జాప్యం అంటూ అబద్ధాలు చెబుతున్నారు.

గింజుకున్నా కొనరే!

  • రబీ ధాన్యం కొనుగోలు తీరుపై అనుమానాలు

  • రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లిన అన్నదాతలకు చుక్కలు

  • మిల్లర్లు బీజీలు ఇవ్వలేదనే సాకుతో పంట కొనుగోలుకు తిప్పలు

  • తేమశాతం సాకుతోనూ ఇబ్బంది పెడుతున్న సేవా కేంద్రాలు

  • కాకినాడ జిల్లాలో రబీ ధాన్యం దిగుబడి 5 లక్షల మెట్రిక్‌ టన్నులు

  • ఇందులో 80 వేల మెట్రిక్‌ టన్నులే సేకరణ టార్గెట్‌

  • విమర్శలు రావడంతో 3.40 లక్షల మె.టన్నులు కొంటామంటూ సవరణ

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రబీ ధాన్యం సేకరణ తీరు అన్నదాతలను నిలువునా ముంచేసేలా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ రైతు సేవా కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అధికా రులు అదిగో ఇదిగో అంటూ అన్నదాతలను ముప్పుతిప్ప లు పెడుతున్నారు. తొంభైశాతం మంది మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేసినా ఇంకా ఇవ్వకపోవడం వల్లే కొను గోళ్లు జాప్యం అంటూ అబద్ధాలు చెబుతున్నారు. అటు తేమశాతం పేరుతోను రేటులో కోత కోస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అయితే ఇదంతా కేవలం ధాన్యం సేకరణ నుంచి తప్పించుకోవడానికే ఇన్ని ఎత్తు లు అనే అనుమానాలు బలపడుతున్నాయి. కాకినాడ జిల్లాలో రబీ సీజన్‌లో అయిదు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. మొత్తం ధాన్యం కొనుగోలు చేయడా నికి అనుమతులు లేనందున 80 వేల మెట్రిక్‌ టన్నులే కొనుగోలుకు మొగ్గుచూపారు. ఇదే విషయాన్ని అధికారు లు బయట వెల్లడించారు. తీరా ఆ తర్వాత విమర్శలు రావడంతో వెనక్కు తగ్గారు. 80వేల మెట్రిక్‌ టన్నులు కాదని.. ఎంత ధాన్యం వచ్చినా కొంటామంటూ మాటమా ర్చారు. ఈ జిల్లాలో ఈనెల 3 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రాల వద్ద అధికారులు అన్నదాతల నుంచి ధాన్యం కొనడం ప్రారంభించారు. తీరా ఇన్ని రోజుల్లో ఇప్పటివరకు సేకరించింది కేవలం 13 వేల మెట్రిక్‌ టన్నులే. ఒకరకంగా ఇది చాలా దిగదుడు పు. అయితే రైతులు మాత్రం చేతికి వచ్చిన పంటను తీసుకుని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్తే అధి కారులేమో ధాన్యం కొనడం లేదు. దీంతో రోజుల తరబడి నిరీక్షించి అన్నదాతలు ఈసురోమంటున్నారు. కరప మం డలంలో అయితే తెచ్చిన ధాన్యాన్ని అధికారులు కొనక పోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఇక్కడే కాదు చాలా మండలాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇదేం టని రైతులు అధికారులను నిలదీస్తే మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వకపోవడంతో కొనుగోలులో జాప్యం జరు గుతోందని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇదేదీ నిజం కాదని తేలింది. జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు 116 మంది మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాల్సి ఉం డగా, 103 మంది ఇచ్చారు. మిగిలిన 13 ఒకటి రెండు రోజుల్లో పూర్తికాన్నాయి. అయితే ఈ నిజాలన్నీ పక్కనప డేసి అధికారులు అబద్ధాలు చెబుతుండడం సేకరణ లక్ష్యానికి దూరంగా ఉండడానికేనని అర్థమవుతోంది. ఇక పలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యానికి తేమశాతం అధికంగా ఉందనే సాకు చెప్పి కొనడం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం కొంత తేమశాతం ఎక్కువగా ఉన్నా ధాన్యం తీసుకోవాలని, ప్రకటించిన మద్దతు ధర రూ. 1740 ఇవ్వాలని ఆదేశించింది. కానీ అధికారులు ఇదేదీ పట్టించుకోవడం లేదు. జిల్లా జేసీకి ఇవన్నీ తెలిసినా కొం తవరకు మెతగ్గా ఉండడంతో అధికారులు మాట వినడం లేదు. అయితే సేకరిస్తామని చెబుతున్న ధాన్యం లక్ష్యాన్ని అధికారులు అసలు పూర్తి చేస్తారా? లేదా? అనే అను మానాలు కలుగుతున్నాయి. అయితే ఇదంతా తెర వెనుక మిల్లర్లకు మేలు చేయడానికేనన్న వాదన వినిపిస్తోంది.

కొనాల్సింది మేమే..

జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రభుత్వం తరపున అధి కారులు సరిగ్గా చేయకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అటు మిల్లర్లు, ఇతర వ్యాపారులు దీన్ని అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం తరపున మద్దతు ధర రూ.1,740 చెల్లించడం కష్టమని, ధాన్యం కూడా కొనుగోలు చేయడానికి ముప్పుతిప్పలు పెడతారంటూ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏ డాది ఖరీఫ్‌ సీజన్‌లో సన్నాలరకం ధాన్యాన్ని వ్యాపారులు 75 కిలోల బస్తా రూ.1,900కు కొనుగోలు చేయగా, ఇప్పు డు అదే సన్నాలను రూ.1,200కు కొనుగోలు చేస్తున్నారు. నెలల వ్యవధిలోనే బస్తాకు రూ.700 కోత కోసేశారు.

‘తూర్పుగోదావరి’లో ధాన్యం కొనుగోలుకు కొత్త చిక్కులు

టార్గెట్‌ పూర్తయిందంటున్న అధికారులు 8 వరి కోతలే ఇంకా పూర్తి కాలేదంటున్న రైతులు

ఇంత ధరకు కొనలేమంటూ చేతులెత్తేసిన మిల్లర్లు 8 విదేశాల్లో బియ్యం ధరలు తగ్గిపోయాయట

జిల్లాలో 5.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా 8 లక్ష్యం 2.5లక్షల మెట్రిక్‌ టన్నులు

ఇప్పటికి 1.49 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ 8 మిగిలిన దాని సంగతేంటో?

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

తూర్పుగోదావరి జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. జిల్లాలో 58,586 హెక్టార్లలో వరిపంట సాగు చేశారు. ఈ సీజన్‌లో పంట బాగుండడంతో మొత్తం 5 లక్షల 80 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వరకూ ఉత్పత్తి అవుతుందని అధి కారులు అంచనా వేశారు. కానీ ప్రభుత్వ కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సాధారణరకం క్వింటాల్‌ ధాన్యం ధర రూ.2300, గ్రేడ్‌-ఏ రకం ధాన్యం ధర రూ.2320కు కొనుగోలు చేస్తున్నారు. 75 కిలోల బస్తా ధాన్యం రూ.1720 నుంచి 1730 వరకూ కొనుగోలు చేస్తున్నారు. పైగా ధాన్యం అమ్మిన 48 గంట లలోపు తమ ఖాతాల్లో డబ్బు పడుతుండడంతో రైతులు సంతో షంగా ఉన్నారు. కానీ బయట మార్కెట్‌లో అయినకాడికి అడు గుతున్నారు. దీనితో రైతులంతా గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తుండడం గమనార్హం. సాధారణంగా ప్రతీ ఏటా జిల్లాలో పం డిన ధాన్యంలో సగం లేదా, అంతకంటే కొంత తక్కువ ధాన్యా న్ని ప్రభుత్వం కొంటుంది. మిగతా ధాన్యాన్ని రైతులు బయట మార్కెట్‌లో అమ్ముకుంటారు. ధాన్యం కమీషన్‌దారులు, మిల్లర్లు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈసారి విదేశాల్లో బియ్యం ధరలు బాగా తగ్గిపోయాయని కారణం చెబుతూ మిల్లర్లు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. లేదా బాగా తక్కువకు అడు గుతున్నారు. క్వింటాల్‌కు రూ.300 వరకూ తగ్గిస్తేనే తాము కొన గలమని తెగేసి చెబుతున్నారు. దీనితో మొత్తం ఽరైతులంతా ప్రభు త్వం వైపు చూస్తున్నారు. కేరళలో ప్రతీ ఏటా కొనే బొండాలు కూడా కొనడం లేదని, విదేశాల్లోనూ డిమాండ్‌ లేదని మిల్లర్లు ప్రచారం చేస్తున్నారు. కానీ స్థానికంగా బియ్యం ధరలు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఈ నేపఽథ్యంలో పూర్తి ధాన్యం కొను గోలు చేయకపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెం దుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకూ సుమారు 48.3 శాతం కోత లు జరిగాయి. అంటే సుమారు సగం కూడా జరగనట్టే. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ధాన్యం సేకరణ పూర్తయిందని అధికారులు చెబుతుంటే, మొత్తం కోతలు పూర్తయ్యాక వచ్చిన ధాన్యాన్ని ఎవరు కొంటారని రైతులు ఆందోళన చెందుతున్నారు.

2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తాం : జేసీ

అయితే రైతుల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉన్న తాధికారులు తమ పాత లక్ష్యాలను సవరిస్తున్నారు. ఈ సీజన్‌లో తాము 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 1,45,657 మెట్రిక్‌ టన్నులు సేకరించి, రైతులకు రూ.176 కోట్ల 32 లక్షలు ఇచ్చామని తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్నరాముడు ప్రకటించారు. రైతు లకు వాట్సాప్‌ యాప్‌ ద్వారా షెడ్యూలింగ్‌ చేసుకునే అవకాశం కల్పించామని, అంతేకాక తమ ధాన్యం తేమ శాతాన్ని బ్లూటూత్‌ ఫంక్షనాలిటీ ద్వారా మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌ రూపంలో పంపే సదుపాయం కూడా కల్పించామన్నారు. రైతులను అమ్మిన ధాన్యా నికి సొమ్ము 24 గంటల నుంచి 48 గంటలోపే వారి బ్యాంక్‌ ఖా తాల్లో జమవుతుందని చెప్పారు. ప్రభుత్వానికి ఽధాన్యం విక్రయిం చిన రైతులంతా సంతృప్తిగా ఉన్నారని, ఎవరికైనా సందేహాలుంటే కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోలు రూమ్‌లోని 8309487151 నంబర్‌ను సంప్రదించాలన్నారు. రోజూ ఉదయం 8 గంటల నుం చి రాత్రి 8 వరకూ ఇది అందుబాటులో ఉంటుందని చెప్పారు.

చెల్లూరు రైతు సేవా కేంద్రం వద్ద రెండు రోజుల కిందట నిరసన తెలుపుతున్న అన్నదాతలు

ధాన్యం కొనాలని చెల్లూరు రైతుల నిరసన

రాయవరం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌లో ముమ్మరంగా వరి కోతలు చేపట్టిన రైతులకు ధాన్యం అమ్మకాల్లో కష్టాలు తప్పడం లేదు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలోని 12 గ్రామాల్లో 14,101 ఎక రాల్లో వరిసాగు చేయగా, ప్రస్తుతం ముమ్మరంగా వరికోతలు సాగుతున్నాయి. ఇప్పటివరకు సుమారుగా 30 శాతం కోతలు పూర్తయ్యాయి. ఈ మండలానికి సంబంధించి 12 గ్రామాల్లో 55 వేల మెట్రి క్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ పండించిన ధాన్యంలో 33 శాతం కొనుగోలు మాత్రమే ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించడంతో రైతులకు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో తాము పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని చెల్లూరు గ్రామానికి చెందిన రైతులు రైతు సేవా కేంద్రం వద్ద ఈనెల 21న నిరసన వ్యక్తంచేశారు. సీఎంఆర్‌ ద్వారా బ్యాంక్‌ గ్యారెంటీ సమర్పించడంతో మంగళవారం నుంచి కొనుగోలు ముమ్మరం చేసినట్టు చెబుతున్నారు.

Updated Date - Apr 23 , 2025 | 01:57 AM