వర్రీయే!
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:22 AM
పంట పండింది.. దిగుబడి బాగుంది.. ఆ పంటను ఏం చేయాలనే దానిపై అయోమయం నెలకొంది. కొంత మంది దళారులను ఆశ్రయి స్తుంటే.. మరికొంత మంతి ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్నారు.
58,586 హెక్టార్లలో సాగు
దిగుబడి 5 లక్షల టన్నులు
కొనుగోళ్లు 2.5 లక్షల టన్నులు
మిగిలిన రైతుల లబోదిబో
మా ధాన్యం కొనాలని డిమాండ్
రాజానగరంలో రైతుల గగ్గోలు
దళారులను ఆశ్రయిస్తున్న వైనం
జిల్లాలో 28 శాతం కోతలు
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)
పంట పండింది.. దిగుబడి బాగుంది.. ఆ పంటను ఏం చేయాలనే దానిపై అయోమయం నెలకొంది. కొంత మంది దళారులను ఆశ్రయి స్తుంటే.. మరికొంత మంతి ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్నారు. పండించిన మొత్తం ధా న్యం పౌర సరఫరాల శాఖ కొనుగోలు చేయ కపోవడంతో చాలా మంది రైతులు బ్రోకర్లు, మిల్లర్లకు ధాన్యం అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మంచి ధర లభిస్తున్నా మొత్తం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి అక్కడా లేదు.జిల్లాలో 58,586 హెక్టార్లలో రబీలో వరి సాగు చేశారు. ప్రస్తుతం కోతలు ఆరంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 5 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవు తుందని వ్యవసాయశాఖ అంచనా.అయితే 2.5 లక్షల ట న్నుల ధాన్యం మాత్రమే కొనుగోళ్లు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలో సుమారు 200లకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటా కామన్ రకం ధాన్యం ధర రూ.2300, అదే గ్రేడ్-ఎ రకం ధర రూ.2,340గా ఉంది.75 కేజీల బస్తా రూ.1720 వరకూ కొనుగోలు చేస్తున్నారు. అయి తే ప్రభుత్వం సాగు చేసిన పంటనంతా కొను గోలు చేసే పరిస్థితి లేక పోవ డంపై ఆందోళన చెందుతున్నారు. పండించిన పంటనంతా ప్రభు త్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజానగరం మండల పరిధిలోని రెండు గ్రామాల్లో ఇప్పటి వరకూ ధాన్యం కొనుగోలు చేయలేదు..అయితే టార్గెట్ పూర్తయి పోయిందని అధికారులు చెప్పడంతో తమ ధాన్యం ఎక్కడ అమ్ముకోవా లని రైతులు ఆందో ళన చెందుతున్నారు. గతంలో ఈ రైతులంతా దళారులు, రైస్ మిల్లర్ల కు అమ్ముకునేవారు. వారు ఎంత ఇస్తే అంత అనే విధంగా ఉండేది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధిక ధర ఇవ్వ డంతో పాటు 48 గంటల్లోపే రైతు ఖాతాల్లో డబ్బులు జమ వుతుండడం వల్ల మిగతా ధాన్యం కొనుగోలు చేయాలని కోరడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకూ 5,732 ఎఫ్‌టీవోలకు రూ.116 కోట్లు జమ చేశారు.
కోతలు జోరు..
జిల్లాలో కోతలు జోరందుకున్నాయి. అధికా రుల లెక్కల ప్రకారం ఇప్పటికి 28శాతం పూర్త య్యాయి.నెలాఖరుకి మరో 40శాతం పూర్తవు తాయని..మే మొదటి వారంలో మొత్తం కోతలు పూర్తవుతాయని జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు తెలిపారు.18 మండలాల్లో మొత్తం 60042 హెక్టార్లలో ఆయకట్టు ఉండగా 58,586 హెక్టార్లలో వరిసాగు చేశారు. అనపర్తి, ఉండ్రాజవరంలో తక్కువగా కోతలు జరిగాయి. రాజమండ్రి రూరల్‌లో 77.6 శాతం, కడియం లో 7.4 శాతం,రాజానగరంలో 38.4 శాతం, అ నపర్తి 1.0 శాతం,బిక్కవోలు 9.2 శాతం, కోరు కొండ 38.9 శాతం,గోకవరం 36.1 శాతం, సీతా నగరంలో 54 శాతం,రంగంపేట 48.3 శాతం, చాగల్లులో 37.8శాతం,దేవరపల్లి 34 శాతం, గో పాలపురం 11.8 శాతం, కొవ్వూరు 56.4 శాతం, నిడదవోలు 43.8 శాతం,పెరవలి 13.7 శాతం, తాళ్లపూడి 15.3 శాతం,ఉండ్రాజవరం 2.1శాతం, నల్లజర్ల 28.8 శాతం కోతలు జరిగాయి.
ఆ రెండు గ్రామాల ధాన్యం కొనేదెవరు?
దివాన్‌చెరువు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఇంకా మా కళ్లాల్లోనే ఉంది.. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం ఎలా పూర్తయ్యిందో అర్ధం కావడంలేదని రాజానగరం మండలంలోని పాత తుంగపాడు, కొత్తతుంగపాడు గ్రామాలకు చెందిన పలువురు రైతులు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తతుంగపాడులో రైతు సేవా కేంద్రం వద్ద వెళ్లి ధాన్యం కొనుగోలు చేయమని కోరగా లక్ష్యం పూర్తయ్యిందని చెబుతుండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మండలంలోని పాతతుంగపాడు, కొత్తతుంగపాడు రెండు గ్రామాలను కలిపి కొత్తతుంగపాడు క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ఈ రెండు గ్రామాల్లో 1100 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా 3600 మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రానికి వెళ్లగా అధికారులు ధాన్యం కొనుగోళ్లు పూర్తయిపోయాయంటూ చల్లగా చెప్పిన కబురుతో తీవ్ర నిరాశ చెందారు. దీంతో రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమగోడు చెప్పుకున్నామని రైతు లు ఉంగరాల ఆదినారాయణ, నాగేశ్వరరావు తదితరులు తెలిపారు.మా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.