రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:23 AM
రాజానగరం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తూ ర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గామన్ బ్రిడ్జి రహదారిపై కొంత మూరు నయారా పెట్రోల్ బంకు వద్ద సోమ వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పాస్టర్ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ మంగళవారం విలేకర్లకు తెలిపారు. హైద రాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్‌బీఎహెచ్ కాలనీకి చెందిన పగడాల ప్రవీణ్‌కుమార్(46

బుల్లెట్‌పై వెళ్తుండగా గామన్ వంతెన వద్ద ఘటన
రాజానగరం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తూ ర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గామన్ బ్రిడ్జి రహదారిపై కొంత మూరు నయారా పెట్రోల్ బంకు వద్ద సోమ వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పాస్టర్ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ మంగళవారం విలేకర్లకు తెలిపారు. హైద రాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్‌బీఎహెచ్ కాలనీకి చెందిన పగడాల ప్రవీణ్‌కుమార్(46) అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగీకుడిగా కొనసాగు తున్నారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై వెనుక లగేజీ బ్యాగ్ కట్టుకుని సోమవారం రాత్రి రాజ మహేంద్రవరం బయలుదేరారు. రాజమహేంద్ర వరంలో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని, భార్య కు చెప్పి బుల్లెట్‌పై బయలుదేరినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మార్గమధ్యలో సోమ వారం అర్ధరాత్రి కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి మోటార్‌సైకిల్ అదుపుతప్పి రహదారి నుంచి పల్లపు ప్రాంతానికి పడిపోవడంతో మోటార్ సైకిల్ ప్రవీణ్‌కుమార్‌పై పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మర్నాడు ఉదయం వరకు ఎవరూ గమనించలేదు. మంగళవారం ఉదయం తమకు వచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించామని, బుల్లెట్‌తో సహా ప్రవీణ్‌కుమార్ రహదారి పైనుంచి కిందికి జారిపోవడం, బుల్లెట్ ఆయనపై పడిపోవడంతో మృతిచెందినట్టు తెలిపారు. ఈ మేరకు మృ త దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమ హేం ద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించామ న్నారు. ఎస్‌ఐ మనోహర్ కేసు నమోదు చేశారు.
పాస్టర్ మృతిపై క్రైస్తవ సంఘాల నాయకుల ఆగ్రహం
రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధన ఆసుపత్రి ఎదుట నిరసన, ధర్నా
రాజమహేంద్రవరం అర్బన్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్రైస్తవ సువార్తికుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మంగళవారం తెల్లవారుజామున కొంతమూరు-ఆటోనగర్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటనపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు, పలువురు మతపెద్దలు, రాజకీయ నాయకులు భగ్గుమన్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, పాస్టర్ ప్రవీణ్‌ను ఆయన వ్యతిరేకులు ఎవరో చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తూ మంగళవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రెండు, మూడు గంటలపాటు రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి ధర్నాను తాత్కాలికంగా విరమింప చేశారు. ఈ ఆందోళనలో మాజీ ఎంపీ హర్షకుమార్, రాజేష్ మహాసేనతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలు, రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ పాస్టర్లు జాన్ వెస్లీ, జేమ్స్, విజయరాజు వంటివారితోపాటు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు క్రైస్తవసంఘ నాయకులు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందలేదనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ విషయంలో నిష్పాక్షికమైన దర్యాప్తు చేయాలని కోరారు. కాగా అంతకుముందు ప్రభుత్వ బోధనాసుపత్రి మార్చురీలో ఉంచిన ప్రవీణ్ మృతదేహాన్ని పలువురు సందర్శించారు.
ఐదు ప్రత్యేక విచారణ బృందాలు : ఎస్పీ
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటనపై కొందరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ సంఘటనపై విచారణకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక పోలీస్ బృందాలు పారదర్శకంగా, ఎటువంటి డివియేషన్స్ లేకుండా కేసును సరైన పద్ధతిలో విచారణ చేస్తున్నాయన్నారు. ఇతరుల మనోభవాలు, మానాభిమానాలు దెబ్బతినేలా, కుల,మత రాజకీయవర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా, మతపరమైన, సున్నిత అంశా ల్లో వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించేలా సామాజిక మధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేసి ప్రజలను రెచ్చకొడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఉన్నాయని, గుర్తిస్తే వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.