Share News

Jana Sena 12th Foundation Day: రాజకీయాల్లో ఓ సంచలనం.. పవన్ సక్సెస్ సీక్రెట్స్ ఇవేనా..!

ABN , Publish Date - Mar 14 , 2025 | 10:29 AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ఎలా అయ్యారు. 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకు తేడా ఏమిటి.. పన్నేండేళ్ల జనసేన ప్రస్థానంలో ఏం సాధించింది.

Jana Sena 12th Foundation Day: రాజకీయాల్లో ఓ సంచలనం.. పవన్ సక్సెస్ సీక్రెట్స్ ఇవేనా..!
Pawan Kalyan

సాదాసీదాగా కనిపించే సినిమా హీరో.. పంచ్‌ డైలాగ్‌లతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ తనదైన స్టైల్‌తో యవతలో బాగా క్రేజ్ సంపాదించిన వ్యక్తి పవన్ కళ్యాణ్.. ఇదంతా 2014 వరకు మాత్రమే.. ఆ తర్వాత సీన్ మారింది. 2014 మార్చి 14 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనొక సంచలనం. పార్టీ పెట్టగానే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ రాజకీయం చేయగలరా అనే అనుమానాలు.. పవన్ ఫ్యాన్స్‌లో ఎక్కువమది ఓట్లు లేని యువతే.. సభలకు జనం వస్తే పోలింగ్ బూత్‌లో ఓట్లు వేస్తారా.. ఇలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీకి దూరంగా ఉంది. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీ, చంద్రబాబు నాయకత్వానికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వంలోఏదో ఒక పదవి తీసుకుంటాడని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించారు. కొన్ని విషయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుపడుతూ ఆయన ఒంటరిగా ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించారు. పార్టీ పెట్టిన ఐదేళ్ల తర్వాత తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన జనసేన పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఆశించిందొకటి.. అయిందొకటి అనేలా ఫలితం వచ్చింది. అయిన్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తానెంటో నిరూపించుకోవానే పట్టుదల మరింత పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలే అంటూ మందుకు సాగారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే వైసీపీ అరాచకాలకు కేరాఫ్‌గా మారడంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతానని ఛాలెంజ్ విసిరారు. మొదట దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ రాజకీయాల్లో పవన్ నిజమైన పొలిటికల్ గేమ్ ఛేంజర్‌గా మారారు.


విజయ రహస్యాలు..

కమిట్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించేవరకు పట్టువిడవరు. దానికి ప్రత్యేక నిదర్శనం 2024 నాటికి టీడీపీ, జనసేన,బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీచేయడం. 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు చూస్తే మరోసారి టీడీపీ, బీజేపీ కలిసిపోటీచేసే అవకాశం లేదనే చర్చ జోరుగా సాగింది. ఈ రెండు పార్టీలు కలుస్తాయనే ఆశ, నమ్మకం చాలా తక్కువ. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. టీడీపీ, జనసే, బీజేపీ కూటమి కోసం బీజేపీ, టీడీపీతో సంప్రదింపులు జరిపి పొత్తు కుదరడానికి పవన్ కళ్యాణ్ కీలకంగా పనిచేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీచేసి ఉన్నా లేదంటే బీజపీ, జనసేన కూటమిగా, టీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటిచేసి ఉంటే ఫలితం మరలా ఉండి ఉండొచ్చు. కానీ ఓవైప బీజేపీ పెద్దలను, మరోవైపు టీడీపీ పెద్దలను ఒప్పించి వైసీపీని గద్దె దించడంలో పవన్ కళ్యాణ్ గేమ్‌ ఛేంజర్‌గా వ్యవహారించారు.


వందశాతం..

జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేటు సాధంచింది. పోటీచేసిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో అద్భుత విజయం సాధంచింది. పోటీచేసిన అన్ని స్థానాలో గెలిచిన పార్టీగా జనసేన సరికొత్త రికార్డు నెలకొల్పింది. కార్యకర్తలకు అండగా ఉండటం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎంతకైనా తెగించడం, సంపాదించుకోవాలనే కోరిక లేకపోవడం, నిస్వార్థంగా సేవ అందించాలనే భావన పవన్ కళ్యాణ్‌ను తక్కువ కాలంలో రియల్ హీరోను చేశాయని చెప్పుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..

Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?

Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్‌ నేతల రహస్య భేటీలు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 14 , 2025 | 10:29 AM