ప్లస్ కాదు.. మైనస్!
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:28 AM
ఇంటర్ అంటే విద్యార్థి భవిష్యత్.. అక్కడ వేసిన అడుగే ముందుకు నడిపిస్తుంది.. ఇంజనీరింగ్.. మెడిసిన్.. ఐఐటీ..జేఈఈ వంటి ఉన్నత చదువులకు పునాది ఇక్కడే.. అటువంటి పునాదికి జగన్ మంగళం పాడేశారు.
ప్లస్ 2 ఇంటర్‌తో అవస్థ
హైస్కూళ్లలో సౌకర్యాలు కరువు
సున్నా ఫలితాలు..దిగజారిన ఉత్తీర్ణత
విద్యార్థుల భవితతో చెలగాటం
జగన్ అనాలోచిత నిర్ణయం ఫలితం
గతేడాది పాస్ శాతం అంతంతే
ఏడాదైనా మారని తీరు..
సర్కారు దృష్టి పెట్టాల్సిందే..
(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)
ఇంటర్ అంటే విద్యార్థి భవిష్యత్.. అక్కడ వేసిన అడుగే ముందుకు నడిపిస్తుంది.. ఇంజనీరింగ్.. మెడిసిన్.. ఐఐటీ..జేఈఈ వంటి ఉన్నత చదువులకు పునాది ఇక్కడే.. అటువంటి పునాదికి జగన్ మంగళం పాడేశారు. రెండేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వ హయాంలో హైస్కూల్స్‌లో ‘ప్లస్’ అంటూ ఉన్నత పాఠశాలల్లో ఆర్భాటంగా ఇంటర్మీడియట్ కోర్సులను ప్రారంభించారు.విద్యార్థుల బోధన అంశాన్ని గాలికొదిలేశారు. దీంతో హైస్కూల్ ప్లస్‌లు విద్యార్థుల జీవితా లను మైనస్‌లో పడేస్తున్నాయి. ఈ ఏడాది కొన్ని పాఠశాలల్లో ఒక్కరూ పాస్ కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి. హైస్కూల్ ప్లస్ అనేది రెంటికీ చెడ్డ రేవ డిగా తయారైంది.పాఠశాల విద్యాశాఖ పదో తరగతి వరకూ దృష్టి సారిస్తోంది. జూని యర్ కళాశాలల్లో విద్యార్థులు మంచి ఫలి తాలు సాధించాలని ఇంటర్ బోర్డు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. కానీ హైస్కూల్ ప్లస్ మాత్రం ఎటు కాకుండా పోతోంది. దీంతో విద్యార్థుల చదువు చతికిలబడుతోం ది.గత వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘హైస్కూలు ప్లస్’ పేరు తో ఏర్పాటు చేసిన ఇంటర్‌కు రెండేళ్లలో పరీక్షలకు హాజరైన విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా పడిపోయింది.కొన్ని స్కూళ్లలో అయితే సున్నా ఫలితాలు వచ్చాయి.హైస్కూలు ప్లస్‌లో సరైన మౌళిక సదుపాయాలు, నిపుణులైన అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థుల భవిత పూర్తిగా అంధకారమైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు హైస్కూలు ఉపాధ్యాయులతోనే విద్యాబోధనను మమ అనిపించారు.దాంతో ఆ హైస్కూలు ప్లస్‌లో చదివిన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం గణనీయంగా పడిపోయింది.
ఏ జిల్లా చూసినా ఇదే తీరు..
తూర్పుగోదావరి జిల్లాలో 22 ఉన్నత పాఠశాలల్లో ‘హైస్కూల్ ప్లస్’ అనే పేరుతో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది కోర్సులను ప్రారంభించారు. తర్వాత రెండో ఏడాది 14 స్కూళ్లలో అందుబాటులోకి తెచ్చారు. అయి తే లెక్చరర్ల నియామకం, ప్రయోగశాలలు, మౌళిక సదుపాయాల ఏర్పాటును పట్టించుకోలేదు. సరైన తరగతి గదులు లేవు. హైస్కూల్ ఉపాధ్యాయులతోనే ఆయా సబ్జె క్టుల్లో పీజీ చేసిన వారితో ఈ విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. ఆ ఉపాధ్యాయులు వారి రెగ్యులర్ తరగతులు చూసుకొని ఇం టర్ విద్యార్థులకు చెప్పాల్సి వస్తోంది. కొన్ని స్కూల్స్‌లో పరీక్షలు దగ్గరకు వచ్చినా కోర్సులో ఏ పుస్తకాలు ఉంటాయి, వాటిలో ఏమి పాఠాలు ఉంటాయనేవి కూడా చాలా మంది విద్యార్థులకు అవగాహన లేకుండా ఉంటుందంటే హైస్కూల్ ప్లస్ విద్యార్థుల దుస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
స్కూలా.. కాలేజీనా?
ఒకటి నుంచి ఐదు వరకూ ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం జరుగుతుంది. వాళ్లు ఆరు నుంచి ఉన్నత పాఠశాల (హైస్కూల్)కి వెళతారు. దీంతో హైస్కూల్ విద్యార్థులమనే ఒక రకమైన ఆనంద భావనతో పిల్లలుంటారు. తర్వాత ఇంటర్మీడియట్ కోసం కళాశాల(జూనియర్ కాలేజీ)లో చేరతారు. అప్పటి వరకూ స్కూల్ పిల్లలమనే భావన నుంచి కాలేజీకొచ్చామంటూ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఫీలవుతారు. అక్కడ మాస్టారు.. ఇక్కడ లెక్చరర్‌గా విద్యను బోధిస్తారు. ఇదంతా పిల్లల మానసిక పరిపక్వత, ఆలోచన సామర్థ్యం, సృజనాత్మకత పెంపుదలకు దోహదపడుతుందని విద్యానిపుణులు చెబుతున్నారు. కానీ హైస్కూల్ ప్లస్ పేరుతో పిల్లలను అక్కడే ఉంచేసి వాళ్లలో గందగోళాన్ని నిం పారు.ఆ ప్రభావం చదువుపై పడే అవకా శం లేకపోలేదని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కార్తీక్ విశ్లేషించారు.జూనియర్ కళా శాలల మాదిరిగా లెక్చరర్లు,మౌలిక సదుపాయాలు, ప్రయోగ శాల లను అందుబాటులోకి తెస్తే పరిస్థితి మారవచ్చు.
ఈ ఏడాది ఫలితాలివీ
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఈ ఏడాది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో హైస్కూల్ ప్లస్ పాఠశాలలు కొన్ని చాలా దారుణమైన ఫలితాలను నమోదు చేశా యి. ఐదు పాఠశాలల్లో మొదటి ఏడాది, ఒక పాఠశాలలో రెండో ఏడాది ఒక్కరూ పాస్ కాలేదు. మొదటి ఏడాది రోల్ 483 ఉంటే 454 మంది పరీక్షలకు హాజర య్యారు. దీంట్లో కేవలం 182 మంది మాత్రమే గట్టెక్కారు. రెండో ఏడాది 283కి 269 మంది పరీక్షలు రాయగా 160 మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఉత్తీర్ణత కాస్త మెరుగుపడడం గమనార్హం.
14 కేంద్రాల్లో.. ఫలితం సున్నా..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ప్రథమ సంవత్సరానికి చెందిన హైస్కూలు ప్లస్ విద్యార్థులు 300 మంది పరీక్షలకు హాజరైతే వారిలో 81 మంది అంటే 27.5 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 219 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో ఫెయిలయ్యారు. ఇక ద్వితీయ సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 224 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే వారిలో 112 మంది అంటే 50 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం, కందికుప్ప, ర్యాలి, పి.గన్నవరం, ఐ.పోలవరం, గొల్లవిల్లి, ముంగండ, జి.వేమవరం పాఠశాలల్లో ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్‌లో సున్నా ఫలితాలు నమోదయ్యాయి. ద్వితీయ సంవత్సరం అంతర్వేదిపాలెంలో సున్నా ఫలితాలు వెలువడ్డాయి. తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమ సంవత్సరంలో సింగంపల్లి,సత్యవాడ,పోతవరం, పెరవలి కేంద్రాల్లో, ద్వితీయ సంవత్సరం అనప ర్తిలో సున్నా ఫలితాలు నమోదయ్యాయి.
దేవీపట్నంలో హాజరు 41.. పాస్ జీరో!
(రంపచోడవరం/రాజవొమ్మంగి-ఆంధ్రజ్యోతి) : అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో మూడు చోట్ల ఉన్నత పాఠశాలల్లో ప్లస్ టు జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. రాజఒమ్మంగి జిల్లా పరిషత్ జూనియర్ కళాశాల, అడ్డతీగల జిల్లా పరిషత్ జూనియర్ కళాశాల, దామనపల్లి గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్లస్ టు కళాశాలలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో అడ్డతీగల, దేవీపట్నంలో జీరో ఫలితాలు వచ్చాయి. దేవీపట్నంలో మొదటి ఏడాదిలో 41 మంది పరీక్షలు రాయగా ఒక్కరూ పాస్ కాలేదు. రాజవొమ్మంగిలో గత రెండేళ్ల నుంచి మొదటి సంవత్సరంలో ఏ ఒక్కరూ పాస్ కాకపోగా, ఈ ఏడాది ముగ్గురు విద్యార్థులు మాత్రమే పాసయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఫలితాలు ఇలా
హైస్కూల్ ప్లస్ ప్రథమ ద్వితీయ
కేంద్రం హాజరు ఉత్తీర్ణత హాజరు ఉత్తీర్ణత
1.రాజమండ్రి సిటీ 29 8 0 0
2.బిక్కవోలు 16 1 0 0
3.అనపర్తి 41 8 6 0
4.పాతతుంగపాడు 19 2 0 0
5.రాజమండ్రిరూరల్ 43 26 43 30
6.రాజానగరం 38 21 24 20
7.సింగంపల్లి 8 0 7 4
8.వెదుళ్లపల్లె 32 17 13 6
9.కుతుకులూరు 11 1 0 0
10.పందలపాక 23 3 13 8
11.కామరాజుపేట 36 14 22 14
12.కడియం 29 9 35 14
13.గాడాల 21 8 23 14
14.సత్యవాడ 2 0 0 0
15.ఖండవల్లి 0 0 0 0
16. పోతవరం 12 0 0 0
17.ఉండ్రాజవరం 7 3 12 7
18.చాగల్లు 18 4 14 9
19.దేవరపల్లి 11 7 16 8
20.నల్లజర్ల 39 17 25 19
21.పెరవలి 4 0 0 0
22.అన్నదేవరపేట 15 7 16 7
----- ----- ----- -----
454 182 269 160
----- ----- ----- -----