వైద్యం అందితే బా’గుండె’...
ABN , Publish Date - Apr 19 , 2025 | 01:30 AM
నిరుపేదైన వెంకట్రావుకు ఓ రాత్రి వేళ అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది.. వెంటనే అతడిని కుటుంబసభ్యులు ఆపసోపాలు పడి ఆటోపై కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీ తీసుకుని అత్యవసర విభాగంలో చేర్చారు. ఆ సమయంలో గుండెకు సంబ ంధించిన వైద్యులు లేరో.. ఏమో అతడికి
కాకినాడ జీజీహెచ్‌లో గుండె వ్యాధులకు అరకొర వైద్యం
కొన్నేళ్లుగా వేధిస్తున్న వైద్యులు, పరికరాల కొరత
వేలాదిగా వస్తున్న రోగులను పరీక్షించేది ఒకరిద్దరు వైద్యులు మాత్రమే
నిరుపేదైన వెంకట్రావుకు ఓ రాత్రి వేళ అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది.. వెంటనే అతడిని కుటుంబసభ్యులు ఆపసోపాలు పడి ఆటోపై కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీ తీసుకుని అత్యవసర విభాగంలో చేర్చారు. ఆ సమయంలో గుండెకు సంబ ంధించిన వైద్యులు లేరో.. ఏమో అతడికి మాత్రం సకాలంలో వైద్యం అందలేదు. ఉదయం ఎప్పుడో డాక్టర్లు వచ్చి వైద్య పరీక్షలు చేశారు. ఛాతిలో నొప్పి వచ్చి కొన్ని గంటలు గడిచినా అదృష్టవశాత్తూ అతడి ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. వాస్తవానికి గుండెలో నొప్పి వచ్చిన వారికి నిమిషాల వ్యవధిలోనే వైద్య పరీక్షలు, వైద్యం అందాలి. లేకుంటే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇతడే కాదు.. ఇలాంటి వారెందరో కాకినాడ జీజీహెచ్‌కు వచ్చి.. పడరాని పాట్లు పడుతున్నారు. పైసలు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే స్థోమత లేక ఆసుపత్రిలోనే మగ్గిపోతున్నారు.
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
కాకినాడ జీజీహెచ్‌లో పనిచేసే ఓ పెద్ద డాక్టరమ్మకు రెండు రోజుల కిందట ఓ రాత్రి వేళ సడన్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆమెను ఆగమేఘాల మీద కాకినాడలో ఓ పేరున్న ప్రె ౖవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యు లు ఈసీజీ, టూడీ ఎకోటెస్ట్‌లు, యాంజియోగ్రామ్ ఇలా అత్యాధునిక పరికరాలతో రకరకాల టెస్టులు చేసి, చివరికి స్టంటు వేశారు. ఐసీయూ రూమ్‌లో ఉంచారు. ఆమె ఆర్థికంగా స్థితిమంతురాలు కావడం, ఎంతోమంది పేదలకు వైద్య సేవలందించే పెద్దాసుపత్రిలో పెద్ద డాక్టరమ్మ కావడంతో అన్నీ క్షణాల్లో అందాయి. ఆమెకు ఎటువంటి అపాయం లేదని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఈ వైద్య నిపుణురాలు ఎంతోమందికి వైద్యం చేసి ప్రాణాలు నిలిపిన కాకినాడ జీజీహెచ్‌ను వదిలి ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకంటే...
కాకినాడ జిల్లా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి.. దశాబ్దాల తరబడి ఎంతో మందికి ఎన్నో రకాల వైద్య సేవలందిస్తోన్న అతి పెద్ద ఆసుపత్రి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులే కాదు.. అటు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు కూడా ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. ఎందుకంటే ఈ ఆసుపత్రి అంటే అంత నమ్మకం.. నిష్ణాతులైన వైద్యులు ఉంటారని, మెరుగైన వైద్యం అం దించి.. ప్రాణాలు నిలబెడతారనే గట్టి విశ్వాసం. సుమారు వెయ్యికిపైగా ఇన్‌పేషంట్లు ఉండే ఈ ఆసుపత్రిలో సుమారు 500కి పైగా వైద్యులు ఉన్నారు. వారిలో ప్రత్యేక వైద్య నిపుణులు కూ డా ఉన్నారు. అందుకే చుట్టు పక్కల ప్రాంతాల ఆసుపత్రి వారు కూడా అత్యవసర కేసులను ఇక్కడికే రిఫర్ చేస్తారు. ఇంత పేరున్న ఆసుపత్రిలో సామాన్యులకు సరైన వైద్యం సకాలంలో అందడం లేదని జనమెరిగిన సత్యం. ఈ ఆసుపత్రిలోని గుండె వ్యాధుల విభాగం గురించి తెలుసుకోవాలంటే కాస్త గుండె నిబ్బరం చేసుకుని చదవక తప్పదు. ఈ విభాగంలో ప్రస్తుతం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. ఇటీవల ఒక అ సోసియేట్ ప్రొఫెసర్‌ను నియమించినా విధుల్లోకి చేరలేదు. ప్రొఫెసర్‌తోపాటు మరో రెండు పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. ప్రస్తుతం మెడికల్ విభాగానికి చెందిన హెచ్‌వోడీయే ఈ గుండె వ్యాధుల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు వైద్యులు, పీజీలు సేవలందిస్తున్నారు. ప్రాథమిక పరీక్షలు చేసినా శస్త్రచికిత్సలు, స్టంట్లు వేయడంవంటి పరిస్థితులు ఇక్కడ లేవు.
పరికరాల కొరత..
కార్పొరేట్‌కు దీటుగా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నాం.. దాతల సహకారంతో అత్యాఽధునిక సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చెబుతున్నా.. అవన్నీ కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పెద్దాసుపత్రి అన్న మాటే తప్ప.. పరికరాల కొరత మాత్రం బాగా వేధిస్తోంది. ఇక్కడ క్యాథ్ ల్యాబ్‌లో హృద్రోగులకు వైద్య పరీక్షలు చేస్తారు. యాంజియోగ్రామ్ ద్వారా రక్తనాళాల్లో బ్లాక్‌లను గుర్తిస్తారు. అవి తెరుచుకునేలా స్టంట్లు వేస్తా రు.. పేస్ మేకర్‌తో సాధారణంగా గుండె కొట్టుకునేలా చేస్తారు. నెలకు సుమారు 20 వరకు యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నట్టు సమాచా రం. ఇక్కడ ఒక్కో పరీక్షకు రూ.పది వేల విలువైన పరికరాలు ఉం డాలి. అయితే వాటిని రోగు లే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యం లో వైద్య పరీక్షలకు, చికిత్సకు అవసరమైన సదుపాయాలు తక్ష ణం కల్పించాల్సి ఉం ది. అరకొరగా ఉన్న గుండె వైద్య నిపుణులను తగిన సంఖ్యలో ని యమించాలని రోగులు, వారి కుటుంబీకులు కోరుతున్నారు.
రోజుకి 200 మందికి ఓపీ..
ఇటీవల కాలంలో గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. మారిన ఆహారపు అలవాటు, వ్యాయామం చేయకపోవడం, ఇలా రకరకాల కారణాలతో హృద్రోగులుగా మారుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అత్యవసర కేసులన్నీ కాకినాడ జీజీహెచ్‌కే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ప్రత్యేకంగా ఓపీ నిర్వహిస్తుంటారు. ఆయా రోజుల్లో రోజుకి సుమారు 200 మంది వరకు రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. అలాగే పలు వార్డుల్లోనూ ఇన్ పేషెంట్లుగా ఉంటూ కొందరు వైద్యసేవలు పొందుతారు.
గడిచిన మూడేళ్లలో జీజీహెచ్‌లో గుండె వ్యాధిగ్రస్తుల వివరాలు పరిశీలిస్తే..
2022లో అవుట్ పేషెంట్లు 23080, ఇన్‌పేషెంట్లు 4041
2023లో అవుట్ పేషెంట్లు 26849, ఇన్‌పేషెంట్లు 3179
2024లో అవుట్ పేషెంట్లు 30873, ఇన్‌పేషెంట్లు 3560