Share News

రాత్రుళ్లు వచ్చి.. మొత్తం దోచేసి..

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:25 AM

దేవరపల్లి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సీఐ కార్యాల యంలో విలేకర్ల సమావేశంలో సీఐ బి.నాగేశ్వర్‌ నాయక్‌ ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 17న తెల్లవారుజామున 3గంటలకు దేవరపల్లి మేయిన్‌రోడ్డులో కొంతమంది యువకులు నెంబ ర్‌ ప్లేట్‌లేని కారులో వచ్చి ఆర్‌కే ఫొటో స్టూడి యోలో తాళాలు పగలకొట్టి విలువైన కెమెరాలు, ల్యాప్‌ట్యాప్‌, 2హార్డ్‌డిస్క్‌లు, ప్రింటర్‌లు దొంగి లించారు. అదే రోజు నిడదవోలులో రెండు స్టూడియోల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.

రాత్రుళ్లు వచ్చి.. మొత్తం దోచేసి..
దేవరపల్లిలో నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ నాగేశ్వర్‌నాయక్‌

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

చోరీ సొత్తు, కారు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్వాధీనం

దేవరపల్లి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సీఐ కార్యాల యంలో విలేకర్ల సమావేశంలో సీఐ బి.నాగేశ్వర్‌ నాయక్‌ ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 17న తెల్లవారుజామున 3గంటలకు దేవరపల్లి మేయిన్‌రోడ్డులో కొంతమంది యువకులు నెంబ ర్‌ ప్లేట్‌లేని కారులో వచ్చి ఆర్‌కే ఫొటో స్టూడి యోలో తాళాలు పగలకొట్టి విలువైన కెమెరాలు, ల్యాప్‌ట్యాప్‌, 2హార్డ్‌డిస్క్‌లు, ప్రింటర్‌లు దొంగి లించారు. అదే రోజు నిడదవోలులో రెండు స్టూడియోల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వీటి విలువ రూ.5లక్షలు. నిందితులను అరెస్ట్‌ చేయ డంతోపాటు చోరిసొత్తును, కారు, రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. గుంటూరుకు చెందిన షేక్‌ సమీర్‌, విజ యవాడకు చెందిన ప్రసాదంపాడు అల్లాడి నాగమణికంఠ ఈశ్వర్‌, తెలంగాణ రాష్ట్ర కోదాడ కు చెందిన నాగ దాసరి ఓమెసిమస్‌, చిలకలూరి పేటకు చెందిన రామిశెట్టి దేవిప్రసాద్‌, తెలం గాణ కోదాడకు చెందిన మునగంటి గోపి, పశ్చి మగోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన కొల్లి వెంకటసూర్య సత్యమణిసాయికీర్తనలను నిం దితులుగా గుర్తించారు. వారిలో ఏ1 షేక్‌ సమీర్‌ పై గుంటూరులో 2 మర్డర్‌ కేసులు, గుంటూరు, టంగుటూరు, కడియం, పోలీస్‌స్టేషన్స్‌లో పలు దొంగతనాల కేసులు, రౌడీషీట్‌ కూడా ఉంది. ఏ2 అల్లాడి మణికంఠ ఈశ్వర్‌పై గుంటూరు, వి జయవాడ, మిరియాలగూడ, కర్నూలు, కడి యం, పోలీస్‌స్టేషన్స్‌లో పలు దొంగతనాల కేసు లు, గంజాయి రవాణా కేసు కూడా ఉంది. ఏ3 నాగదాసరి ఓమసిమస్‌పై కోదాడ, గుంటూరు, విజయవాడ, మిరియాలగూడ, కర్నూలు, కడి యం పోలీస్‌స్టేషన్స్‌లో పలు దొంగతనాలు కేసు లు, రౌడీషీట్‌ కూడా ఉంది. ఏ5 మునగంటి గోపిపై కోదాడ, గుంటూరు, విజయవాడ, మిరి యాలగూడ, కర్నూలు, కడియం పోలీస్‌స్టేష న్స్‌లో పలు దొంగతనాల కేసులు, రౌడీషీట్‌ ఉం ది. నిందితులు ముందుగా మంగళగిరిలో కారు ను అద్దెకు తీసుకుని కారునెంబర్‌ప్లేట్‌ తీసేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగతనం చేసే ప్రదేశాన్ని ముందుగా రెక్కీ నిర్వహిస్తారు. తరువాత కొన్నిషాపులు, ఇళ్లను లక్ష్యంగా ఎంచు కుని రాత్రి సమయాల్లో ఇనుపరాడ్లువంటి పరిక రాలు ఉపయోగించి షట్టర్లు, తాళాలను పగల గొట్టి దొంగతనాలకు పాల్పడతారు. వారు దొంగ తనాలకు పాల్పడిన దేవరపల్లి, నిడదవోలు ప్రా ంతాల్లో సీసీకెమెరాల్లో నమోదు కావడం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో చేధించి పట్టుకోవడం జరిగిందని సీఐ పేర్కొన్నారు. వారు దేవరపల్లి డైమండ్‌ జంక్షన్‌లో చోరిసొత్తుతో పరారవుతుం డగా బుధవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో సహకరించిన పోలీసులను అభి నందించారు. ప్రతిభ చూపిన దేవరపల్లి ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, గోపాలపురం ఎస్‌ఐ సతీష్‌కుమా ర్‌ వారికి సహకరించిన హెడ్‌కానిస్టేబుల్‌ భీమ రాజు, కానిస్టేబుల్స్‌ బాలచంద్రరావు, సలీం, పం డు, దుర్గారావు, స్వామి, నాగేంద్ర, వెంకట్‌లను రివార్డుకు షిఫార్సు చేయనున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:25 AM