జిల్లా పోలీసు కార్యాలయంలో 30అర్జీలు
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:49 AM
జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు.
అమలాపురం టౌన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి వద్ద నుంచి కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై 30 అర్జీలను ఎస్పీ కృష్ణారావు నేరుగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే క్షేత్ర స్థాయి అధికారులకు సమాచారం అందించి చట్టపరిధిలో పరిష్కారాలకు ఆదేశాలు జారీ చేశారు.