Share News

భూగర్భ జలాలు పెంచే యజ్ఞం!

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:24 AM

కోటనందూరు, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాల పెంపుతో సాగు, తాగునీటి సమస్యను తీర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞంలా ఫారం ఫాండ్స్‌ (నీటి కుంటలు) ఏర్పా టుకు చర్యలు చేపట్టింది. భూమిలో తేమశాతం సంరక్షించాలన్నే లక్ష్యంతో తవ్వకాలు చేపట్టింది. ప్రతి పంచాయతీలో పదికి తగ్గకుండా వీటిని

భూగర్భ జలాలు పెంచే యజ్ఞం!
కోటనందూరు మండలం ఎస్‌ఆర్‌పేటలో నీటికుంట ఏర్పాటు చేస్తున్న దృశ్యం(ఫైల్‌)

నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు

ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు

జూన్‌ నెలాఖరు నాటికి పూర్తిచేయడమే లక్ష్యం

కోటనందూరు, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాల పెంపుతో సాగు, తాగునీటి సమస్యను తీర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞంలా ఫారం ఫాండ్స్‌ (నీటి కుంటలు) ఏర్పా టుకు చర్యలు చేపట్టింది. భూమిలో తేమశాతం సంరక్షించాలన్నే లక్ష్యంతో తవ్వకాలు చేపట్టింది. ప్రతి పంచాయతీలో పదికి తగ్గకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉం డడంతో వీటికి నిధులు విడుదల చేయడం తో పాటు పనులు వేగవంతంగా జరగాలని ఆదే శాలు ఇచ్చారు. ఇటీవల ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చేపట్టారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నీటికుంటల పనులు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో లక్షా 55 వేలు నీటి కుంటల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే జిల్లాలో కూడా వీటి ఏర్పాటుకు ఒక నిర్దిష్టం సంఖ్య ఏర్పాటు చేసి ఉపాధి నిధులతో పనులు చేపడుతున్నారు. జాన్‌ నెలాఖరు నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశాలు ఉండడంతో అందుకనుగుణంగా పనులు జరుగుతున్నాయి.

అన్నదాతలకు అవగాహన

నీటి కుంటల ఏర్పాటుపై అన్నదాతలకు అధికారులకు అవగాహన కల్పించి తద్వారా ఏర్పాటుకు ముమ్మరంగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం వైసీపీ వీటిని నిర్లక్ష్యం చేయగా కూట మి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నీటి కుంటల ఏర్పాట్లు ముందుకు సాగుతున్నాయి. సాగునీటి వనరులు పెంచే లక్ష్యంతో అధి కారు లు అడుగులువేస్తున్నారు. దీనిలో భాగంగా కాకినాడ జిల్లాలో 2500 నీటి కుంటల ఏర్పాటు లక్ష్యం కాగా అందులో రూ.25 కోట్లతో పనులు చేపడుతున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా లో 1500 నీటికుంటల ఏర్పాటు లక్ష్యం కాగా... రూ.4.50కోట్లు నిధులు ఇచ్చారు. ఇప్పటి వరకూ 1166 గుర్తించగా అందులో 138 పూర్తిచేశారు. ఒక్కోటి అంచనా వ్యయం రూ.25 వేల నుంచి 35వేలు అని చెప్పవచ్చు. అనుకున్న లక్ష్యం ప్రకా రం మొత్తం జూన్‌ నెలఖారు నాటికి నీటి కుంట లు పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి.

ఉపయోగాలివే...

రైతుల పొలంలో నీటికుంటలు తవ్వకాలు చేయడం వల్ల భూగర్భ జలాలు పెంచడంతో పా టు, భూమిలో తేమ శాతం, పశువులకు తాగునీరు, పంటలకు పురుగు మందుల పిచికారీకి నీరు, అందుబాటులో ఉంటుంది. బోరు బావి దగ్గర్లో ఏర్పాటు చేస్తే నీటి శాతం పెరుగుతోంది. దీంతో రైతులను చైతన్యపరిచి నీటికుంటలు ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నా రు. నీటకుంటలు సైజు ఆధారంగా రేట్లు ఉంటా యి. తక్కువ ఖర్చుతో ప్రయోజనకరంగా ఉండేందుకు వీలుగా పొలాల్లో 8 మీటర్లు వెడల్పు, 8మీటర్లు పొడవుకు 2మీటర్లు లోతుకు 128 చదరపు మీట ర్లు నీటికుంటకు రూ.38,400 ఉపాధి నిధులను ఖర్చు అవతుంది. అలాగే పలు రకాలుగా పొడవు, వెడల్పుతో నీటికుంటలు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:24 AM