విద్యార్థులకు సంపూర్ణ మనో వికాసం అవసరం
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:47 AM
విద్యార్థులకు సంపూర్ణ మనో వికాసం కలిగే విధంగా గురువులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఉపాధ్యాయులను కోరా రు. బుధవారం మండలంలోని వెదుళ్లపల్లిలోని ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన కాంపౌండ్ వాల్, సత్య బొల్లీస్ సైన్స్ ల్యాబ్, డై నింగ్ హాల్‌లను ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిలతో కలసి ఆమె ప్రారంభించారు.
ఎంపీ పురందేశ్వరి
సీతానగరం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సంపూర్ణ మనో వికాసం కలిగే విధంగా గురువులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఉపాధ్యాయులను కోరా రు. బుధవారం మండలంలోని వెదుళ్లపల్లిలోని ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన కాంపౌండ్ వాల్, సత్య బొల్లీస్ సైన్స్ ల్యాబ్, డై నింగ్ హాల్‌లను ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిలతో కలసి ఆమె ప్రారంభించారు. దాత బొల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నీరుకొండ వీరన్నచౌదరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుతం విద్య అంటే క్లాస్ రూమ్‌లు, మెడల్స్, ర్యాంకులు అను కుంటున్నారని, విద్యార్థుల్లో సామాజిక స్పృహ, సమాజం పట్ల బాధ్యత, దేశభక్తి విస్మరిస్తున్నారన్నారు. కొంత మంది గురువుల వెర్రి పోకడలు చూ స్తుంటే తల్లిదండ్రులు ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయన్నారు. గురువులు తరగతి గదుల్లో పాఠ్య పుస్తకాల్లో ఉన్న వాటిని మాత్ర మే చెప్పి వదిలేయకుండా సామాజిక స్పృహ కల్గించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, తనకాల నాగేశ్వరరావు, మండ లాధ్యక్షురాలు రాపాక వెంకటలక్ష్మి, వలవల రాజా, మట్ట వె ంకటేష్ పాల్గొన్నారు.