Share News

రంగంపేట అభివృద్ధికి సహకరించాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:08 AM

రంగంపేట మండలాభివృద్ధికి పార్టీలకు అతీతంగా అం దరూ సహకరించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రభు త్వం పాలిస్తోందన్నారు.

రంగంపేట అభివృద్ధికి సహకరించాలి
పీఎంఅజయ్‌లో మంజూరైన ఆటోను అనూషకు అందిస్తున్న ఎమ్మెల్యే

  • కాలువల అభివృద్ధికి రూ.80 లక్షల మంజూరు.. త్వరలో పనులు

  • మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిలి

రంగంపేట,మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రంగంపేట మండలాభివృద్ధికి పార్టీలకు అతీతంగా అం దరూ సహకరించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రభు త్వం పాలిస్తోందన్నారు. మండలంలోని చాగల్నాడు, వెంకటనగరం కాలువల అభివృద్ధికి రూ.80 లక్షల మంజూర య్యాయని, త్వరలోనే పనులు చేపడతామన్నారు. అనంతరం అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులతో మండలంలోని వివిధ సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పేపకాయల రాంబాబు, ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి, ఎంపీడీవో వి.సాయిబాబు, తహశీల్దార్‌ కోసు అనసూయ, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

  • సబ్సిడీ రుణాలను వినియోగించుకోవాలి

ప్రధాన మంత్రి అనుసుచిత్‌ జాతి అభ్యుదయ యోజన (పీఎంఅజయ్‌) పథకంలో భాగం గా రంగంపేటలో డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు మంజూరైన ఆటోను ఆకుమర్తి అనూషకు ఎమ్మెల్యే నల్లమిల్లి బుధవారం అం దించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకొని డ్వాక్రా సం ఘాల్లోని సభ్యులు సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, ఎలుగుబంటి సత్తిబాబు, పూసల శ్రీని వాస్‌, ఉద్దండ్రావు శ్రీను, కొమ్మన రాంబాబు, బ లిరెడ్డి దుర్గారావు, పి.చిన్నికాపు పాల్గొన్నారు.్ల

Updated Date - Mar 27 , 2025 | 01:08 AM