Share News

ఈ వేస్ట్‌ ఇంట్లో ఉంటే..కేన్సర్‌ ముప్పు

ABN , Publish Date - Apr 20 , 2025 | 01:07 AM

ఈ వేస్ట్‌పై అవగాహన లేక ప్రజలు వాటిని ఇంట్లో నిల్వచేస్తున్నారని.. దీని వల్ల అనారోగ్యం పాలవుతారని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.

ఈ వేస్ట్‌ ఇంట్లో ఉంటే..కేన్సర్‌ ముప్పు
సుబ్రహ్మణ్య మైదానంలో ఈ వ్యర్థాలను పరిశీలిస్తున్న మంత్రి దుర్గేష్‌, చిత్రంలో కలెక్టర్‌ ప్రశాంతి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ తదితరులు

రాజమహేంద్రవరం సిటీ/రూరల్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఈ వేస్ట్‌పై అవగాహన లేక ప్రజలు వాటిని ఇంట్లో నిల్వచేస్తున్నారని.. దీని వల్ల అనారోగ్యం పాలవుతారని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాజమహేం ద్రవరం సుబ్రహ్మణ్యం మైదానం, బొమ్మూరు వైటీసీ ప్రాంగణంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాలకు హాజరై మాట్లా డారు. ఈ వేస్ట్‌ అంటే ఎలక్ట్రికల్‌ వ్యర్థాలని.. టీవీ, కంప్యూటర్‌, మొబైల్‌ పోన్లు, వైర్లు, ఎలక్ట్రికల్‌ పరికరాలు పాడైపోయిన తరు వాత నిల్వచేయకూడదని చెప్పారు.వాటిని రీసైక్లింగ్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రంలో అప్ప గించాలన్నారు. ఎలక్టానిక్‌ వ్యర్థాల వల్ల అనా రోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎలక్ర్టానిక్‌ వ్యర్థాల నుంచి వెదజల్లే రేడియేషన్‌ వల్ల కేన్సర్‌, ఇతర అనారోగ్యాలకు గురి కావడం చూస్తున్నామన్నారు.కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ ప్రతివారం మూడో శనివారం స్వచ్ఛాం ధ్ర- స్వచ్ఛ దివస్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తుందన్నారు.ఈ వారం ఈ వేస్ట్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ వేస్ట్‌లో ఉత్పన్నమయ్యే రసాయనాల వల్ల క్యాన్సర్‌ వస్తుందని.. అటువంటివి ఇంట్లో ఉంటే వెంటనే వాటిని సేకరణ కేంద్రాలకు అప్పగించాలన్నారు. ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సరైన విధానంలో డిస్పోజ్‌ చేయాలన్నారు. రాజమహేంద్రవరం, రూరల్‌, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరం ట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఈ వేస్ట్‌ విషయంలో మహిళలు అవగాహన కలిగి ఉం డాలన్నారు. కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ మాట్లాడుతూ ఈవేస్ట్‌ను సేకరించే కేం ద్రాలు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తున్నామని..ప్రజల నుంచి పరికరాల వారీగా కొనుగోలు చేసి వాటిని శ్రీకాకుళం వద్ద ఉన్న రీసైక్లింగ్‌ ప్లాంట్‌కు తరలిస్తామన్నారు. అనం తరం పోస్టర్‌ను ఆవిష్కరించి సేకరించిన ఎలక్ర్టి కల్‌ వేస్ట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్‌ స్టేట్‌ చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు, ఇన్‌చార్జి డీపీవో శాంతామణి, డ్వామా పీడీ ఏ నాగమహేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ మూర్తి, డీఎల్‌డీవో వీణాదేవి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మజ్జి రాం బాబు, నగరపాలక సంస్థ సెక్రటరీ శైలజవల్లి, ఎంహెచ్‌వో డాక్టర్‌ వినూత్న, మండల ప్రత్యేకాధికారి ఎన్‌.జ్యోతి,రూరల్‌ ఎంపీడీవో శ్రీనివాసరావు , ఈఈ మదర్షా ఆలీ,శానిటరీ సూపర్‌వైజర్‌ ఇంద్రగంటి శ్రీనివాస్‌, ఆర్‌వో సీహెచ్‌.శ్రీనివాసరావు, మేనేజరు మాలిక్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 01:07 AM