ఫలితం..పదిలం!
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:33 AM
హమ్మ య్య..టెన్‌షన్ తీరింది..ఫలితం పదిలమైం ది. బుధవారం వెలువడిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా మెరుగైన స్థానంలో నిలిచింది.
గతేడాది 82ు.. ఇప్పుడు 87.99ు
తూర్పున పైచేయి సాధించిన బాలికలు
రాజమహేంద్రవరం,ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): హమ్మ య్య..టెన్‌షన్ తీరింది..ఫలితం పదిలమైం ది. బుధవారం వెలువడిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా మెరుగైన స్థానంలో నిలిచింది. గతేడాది 21వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది మాత్రం రాష్ట్రవ్యా ప్తంగా గతేడాది కంటే మెరుగై ఈసారి ఆరో స్థానానికి ఎగ బాకింది.ఈ ఏడాది పక్కా ప్రణాళికతో మూడు నెలల ముందు నుంచే కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాలతో డీఎస్‌ఈవో కె.వాసుదేవరావు స్వీయ పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠ శాల ల్లోని ప్రతి విద్యార్థిపై దృష్టి సారించారు.సబ్జెక్టుల వారీగా విశ్లేషణ చేసి వెనుకబడిన వారికి ప్రత్యేక తరగ తులు నిర్వహించారు.దీంతో మెరుగైన స్థానం దక్కింది. బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు.11413 మం ది బాలికలకు 10268 (89.97ు),బాలురు 11975 మందికి 10310 (86.10ు) మంది ఉత్తీర్ణులయ్యా రు. జిల్లాలో మొదటి స్థానంలో అనపర్తి మండలం(95.67ు),చివరి స్థానంలో చాగల్లు(76.70ు) మండలం ఉంది. కొవ్వూరు డివిజన్‌లో 84.67ు ఉత్తీర్ణత సాధించగా.. రాజమహేంద్ర వరం డివిజన్ లో 89.69 శాతం మంది విద్యార్థులు పాస య్యారు.ప్రైవేటు స్కూల్స్‌తో దాదాపు సమాన సంఖ్యలో జిల్లా పరిషత్ విద్యార్థులు పరీక్షలు రాయగా ఉత్తీర్ణతలో మాత్రం ప్రైవేటు కంటే 16 శాతం వెనుకబడ్డారు. ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్ 4588 విద్యార్థులు పరీక్షలు రాయగా 3659 (79.75ు) మంది,పదో తరగతి 2299 మందికి 1874 (81.51ు) ఉత్తీర్ణత సాధించారు.
3 జిల్లాలకు మూడు స్టేట్ ర్యాంకులు..
ఉమ్మడి తూర్పుగోదావరి ఖాతాలో పదిలోపు మూడు స్టేట్ ర్యాంకులు పడ్డాయి.భాష్యం విద్యా సంస్థల్లో కాకినాడ శాంతినగర్ బ్రాంచిలో చదువుతున్న యాళ్ల నేహాంజని 600/600తో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. తూర్పు గోదావరి బొమ్మూరు భాష్యం విద్యార్థి హర్షిత్‌కలిగి 599తో రెండు,కాకినాడ జిల్లా పిఠాపురం భాష్యం విద్యార్థిని కొట్టేటి ప్రేమ సత్యలిఖిత ఐదో ర్యాంకు సాధించారు.
సెల్‌ఫోన్.. టీవీకి దూరంగా ఉండి చదివి..సాధించా..
600 మార్కులు రావడం సంతోషంగా ఉంది. స్కూల్లో అందరూ 598 మార్కులు వస్తే చాలు అనుకున్నారు. కానీ నేను 600కి 600 రావాలనుకున్నాను. నేను పరీక్షలు రాసి వచ్చాక.. ప్రతిరోజూ క్వశ్చన్ పేపర్ కీని పరిశీలించేదాన్ని. అప్పుడే నాకు 600 మార్కులు వస్తాయని ఊహించా. నేను సెల్‌ఫోన్‌కు, టీవీకి దూరంగా ఉంటూ చదువుకున్నా.. ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ గణితం. ఈ మార్కులు నా కుటుంబానికి, మా స్కూల్ యాజమాన్యానికి అంకితమిస్తున్నా. - నేహాంజని, టెన్త్ స్టేట్ టాపర్, కాకినాడ
రోజుకు 12 గంటలు చదివా..
ఇష్టపడి చదవడం ద్వారా పదో తరగతి పరీక్షల్లో 599 మార్కులు సాధించా. రోజుకి 12 గంటల పాటు చదివి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సూచనలు పాటించా. డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. పేదలకు వైద్యం చేయాలని భావిస్తున్నా. మా తండ్రి కె.శివసూర్యనారాయణ ప్రైవేటు సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి వీరరాఘవమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.
- కొట్టేటి ప్రేమసత్యలిఖిత, పిఠాపురం భాష్యం పాఠశాల
ఆరంభం నుంచి కష్టపడ్డా..
పదో తరగతి ఫలితాల్లో 599 మార్కులు సాధించడానికి చాలా కష్టపడ్డా.. ఆరంభం నుంచి ప్రణాళికాబద్ధంగా చదివా. మా ఉపాధ్యాయుల సహకారం ఎంతగానో ఉంది. జేఈఈ అడ్వాన్స్‌లో మంచి ర్యాంకు సాధించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలన్నదే నా ఆశయం. మా తండ్రి రైల్వే ఉద్యోగి. మా ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్, సబ్జెక్ట్ టీచర్లు ఎప్పటికపుడు గైడెన్స్ ఇచ్చేవారు. అది నాకు మంచి మార్కులు సాధించేందుకు దోహదపడింది.
- కె.హర్షిత్, రాజమహేంద్రవరం భాష్యం పాఠశాల