ఫలితం..పదిలం!
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:03 AM
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలో బాలికలు పైచేయి సాధించారు. ఉదయం 10 గంటలకు పది ఫలితాలను విడుదల చేశారు. జిల్లాలో ఈ పరీక్షలకు 28,963మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 142 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సంబంధించి 27,368 మంది విద్యార్థులు పరీక్షలురాయగా 22,508మంది ఉత్తీర్ణత సాధించగా 4860మంది పాస్ కాలేదని డీఈవో పి.రమేష్ తెలిపా రు.
గతేడాది 22- ఈ ఏడాది 15వ స్థానం
గతేడాది 86.69ు.. ఇప్పుడు 81.14ు
జిల్లాలో పైచేయి సాధించిన బాలికలు
కాకినాడ రూరల్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలో బాలికలు పైచేయి సాధించారు. ఉదయం 10 గంటలకు పది ఫలితాలను విడుదల చేశారు. జిల్లాలో ఈ పరీక్షలకు 28,963మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 142 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సంబంధించి 27,368 మంది విద్యార్థులు పరీక్షలురాయగా 22,508మంది ఉత్తీర్ణత సాధించగా 4860మంది పాస్ కాలేదని డీఈవో పి.రమేష్ తెలిపా రు. కాకినాడ డీఈవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఫలితాల వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఉత్తీర్ణులైన వారిలో 10,850మంది బాలురు, 11,658మంది బాలికలు ఉన్నారన్నారు. బాలురు 78.31, బాలికలు 84.09శాతం ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు పూర్తయి న 22రోజుల్లో ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. 2023లో 72.26శాతం, గతేడాది జిల్లాలో 86.69శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 81.14శాతం ఉత్తీర్ణులయ్యారు. వారిలో 17,098మంది ప్రథమశ్రేణి, 3568మంది ద్వితీయశ్రేణి, 1842మంది తృతీయశ్రేణిలో ఉత్తీర్ణత పొందా రు. ఉత్తీర్ణతాశాతం జిల్లాలో తగ్గినప్పటికీ రాష్ట్రస్థాయి ఫలితాల్లో గతేడాది 22వస్థానంలో ఉండగా ఈఏడాది 15లో నిలవడంతో గతేడాదికంటే మెరుగైన స్థానాన్ని సాధించింది.
ఫ సార్వత్రిక విద్య పది, ఇంటర్ ఫలితాలను కూడా బుధవారం విడుదల చేశారు. జిల్లాలో పదిపరీక్షలకు 2066 మంది హాజరుకాగా 1754మంది ఉత్తీర్ణులు కాగా 85శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ పరీక్షలకు 6395మంది విద్యార్థులు హాజరుకాగా 5172మంది ఉత్తీర్ణులు కాగా 81శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు జిల్లా సమన్వయకర్త పి.సాయివెంకటరమణ తెలిపారు.
ఫ పదిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమష్టి కృషి కారణమైందని ఆర్జేడీ జి.నాగమణి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ డీఈవో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏసీఈ రాజశేఖర్, డీసీఈబీ వెంకట్రావు పాల్గొన్నారు.
రీకౌంటింగ్.. రీవెరిఫికేషన్
ఫ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం 24న ఉదయం 10 నుంచి మే 1 రాత్రి 11 గంటల వరకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యా యులకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో తెలిపారు. రీకౌంటింగ్ కి ఒక సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కి ఒక సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించాలని ఆయన చెప్పారు. అడ్వాన్సు సంప్లిమెంటరీని మే 19 నుంచి 28 వరకూ నిర్వహించనున్నారన్నారు.
ఫ ఓపెన్ స్కూల్ విద్యార్థులు రీకౌంటిం గ్‌కి రూ.200,రీవెరిఫికేషన్, జిరాక్సు కాపీల జారీకి రూ.వెయ్యి,అడ్వాన్సు సప్లిమెంటరీకి ఈ నెల 26 నుంచి మే 5లోపుగా ఏపీ ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అడ్వాన్సు సంప్లిమెంటరీని మే 19 నుంచి 24 వరకూ నిర్వహిస్తారు. వివరాలకు హైస్కూల్ హెచ్‌ఎంని సంప్రదించాలి.
మండలం హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణులు శాతం
యానాం 255 247 96.86
పెదపూడి 782 733 93.73
కోటనందూరు 437 393 89.93
రౌతులపూడి 531 475 89.45
గొల్లప్రోలు 937 831 88.69
తుని 2338 2057 87.98
ఏలేశ్వరం 980 839 85.61
గండేపల్లి 518 443 85.52
కాజులూరు 614 517 84.2
కాకినాడ అర్బన్ 5139 4317 84
పిఠాపురం 1931 1587 82.19
కరప 802 652 81.3
సామర్లకోట 1521 1232 81
కాకినాడ రూరల్ 2433 1924 79.08
ప్రత్తిపాడు 843 662 78.53
శంఖవరం 710 556 78.31
జగ్గంపేట 1124 870 77.4
తొండంగి 988 763 77.23
యు.కొత్తపల్లి 855 654 76.49
కిర్లంపూడి 818 622 76.04
పెద్దాపురం 1546 1174 75.94
తాళ్లరేవు 1266 960 75.83
మొత్తం 27,368 22,508 81.14
సెల్‌ఫోన్.. టీవీకి దూరంగా ఉండి చదివి..సాధించా..
600 మార్కులు రావడం సంతోషంగా ఉంది. స్కూల్లో అందరూ 598 మార్కులు వస్తే చాలు అనుకున్నారు. కానీ నేను 600కి 600 రావాలనుకున్నాను. నేను పరీక్షలు రాసి వచ్చాక.. ప్రతిరోజూ క్వశ్చన్ పేపర్ కీని పరిశీలించేదాన్ని. అప్పుడే నాకు 600 మార్కులు వస్తాయని ఊహించా. నేను సెల్‌ఫోన్‌కు, టీవీకి దూరంగా ఉంటూ చదువుకున్నా.. ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ గణితం. ఈ మార్కులు నా కుటుంబానికి, మా స్కూల్ యాజమాన్యానికి అంకితమిస్తున్నా.
- నేహాంజని, టెన్త్ స్టేట్ టాపర్, కాకినాడ
రోజుకు 12 గంటలు చదివా..
ఇష్టపడి చదవడం ద్వారా పదో తరగతి పరీక్షల్లో 599 మార్కులు సాధించా. రోజుకి 12 గంటల పాటు చదివి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సూచనలు పాటించా. డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. పేదలకు వైద్యం చేయాలని భావిస్తున్నా. మా తండ్రి కె.శివసూర్యనారాయణ ప్రైవేటు సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి వీరరాఘవమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.
- కొట్టేటి ప్రేమసత్యలిఖిత, పిఠాపురం భాష్యంపాఠశాల
ఆరంభం నుంచి కష్టపడ్డా..
పదో తరగతి ఫలితాల్లో 599 మార్కులు సాధించడానికి చాలా కష్టపడ్డా.. ఆరంభం నుంచి ప్రణాళికాబద్ధంగా చదివా. మా ఉపాధ్యాయుల సహకారం ఎంతగానో ఉంది. జేఈఈ అడ్వాన్స్‌లో మంచి ర్యాంకు సాధించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలన్నదే నా ఆశయం. మా తండ్రి రైల్వే ఉద్యోగి. మా ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్, సబ్జెక్ట్ టీచర్లు ఎప్పటికపుడు గైడెన్స్ ఇచ్చేవారు. అది నాకు మంచి మార్కులు సాధించేందుకు దోహదపడింది.
- కె.హర్షిత్, రాజమహేంద్రవరం భాష్యం పాఠశాల