హోప్..ఐ లాండ్!
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:11 AM
ఆరేళ్లుగా నిలిచిపోయిన సముద్రంలోని హోప్ ఐలాండ్ బోటు షికారు మళ్లీ మొదలుకాబోతోం ది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పర్యా టకులకు అటవీశాఖ తీపికబురు అందించింది.
హోప్‌ఐలాండ్, లైట్‌హౌస్ షికారు
రోజూ నాలుగు స్పీడ్ బోట్లు
ఒక్కో బోటులో నలుగురు
ఒక్కొక్కరికి టిక్కెట్ రూ.2,500
రోజంతా విహారానికి రూ.10 వేలు
త్వరలో ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్
కోరంగిలో నేరుగా టిక్కెట్ల సేల్స్
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
ఆరేళ్లుగా నిలిచిపోయిన సముద్రంలోని హోప్ ఐలాండ్ బోటు షికారు మళ్లీ మొదలుకాబోతోం ది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పర్యా టకులకు అటవీశాఖ తీపికబురు అందించింది. కోరంగి అభయారణ్యం నుంచి హోప్ ఐలాండ్, కోరంగి నుంచి భైరవపాలెంలోని బ్రిటిష్ కాలం నాటి లైట్‌హౌస్‌కు రెండు వేర్వేరు రూట్లలో స్పీడ్ బోట్లు నడపాలని నిర్ణయించింది. ఇటీవల ట్రయ ల్ రన్ పూర్తి చేసి పర్యాటకుల కోసం బోట్లను రెండు రోజుల కిందట సిద్ధం చేసింది. రాజమ హేంద్రవరం, దిండి వద్ద గోదావరిలో బోటు షికారుకు ఆదరణగా ఎక్కువగా ఉండడంతో త్వరలో కొత్తగా మరో మూడు స్పీడ్ బోట్లను కొనుగోలు చేసి తిప్పడానికి రాష్ట్ర పర్యాటకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
సీఎం చంద్రబాబు చొరవ
సీఎం చంద్రబాబు కొన్నినెలల కిందట అధికా రులతో నిర్వహించిన సమీక్షలో హోప్‌ఐలాండ్‌కు బోటు షికారును ప్రారంభించాలనే దానిపై చర్చ జరిగింది. అటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కాకినాడ జిల్లా మంత్రిగా ఉండడం, ఎన్నికల సమయంలో హోప్‌ఐలాండ్ పర్యాటకంపై ఆయ న హామీ ఇచ్చిన నేపథ్యంలో వేగంగా దీన్ని ప్రా రంభించాలని అధికారులకు సీఎం సూచించారు. దీంతో రూ.2 కోట్లతో కొత్త బోటు కొనుగోలు చేయాలని అధికారులు భావించినా ఆచరణలోకి రాలేదు. కొన్ని వారాల కిందట ప్రభుత్వం అట వీశాఖను రంగంలోకి దించడంతో హోప్ ఐలాం డ్‌కు బోటు షికారును ప్రారంభించడానికి ఏర్పా ట్లు పూర్తిచేసింది. తన వద్ద ఉన్న నాలుగు స్పీడ్ బోట్లకు ఇటీవల కొత్తగా ఇంజన్లను కొనుగోలు చేసి సిద్ధం చేసింది. ఇటీవల ట్రయిల్‌రన్ పూర్తి చేసి సర్వీసులు నడపానికి సిద్ధమైంది.
ఆరేళ్ల కిందట నిలిపివేత..
2019 సెప్టెంబర్‌లో గోదావరిలో కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం హోప్ ఐలాండ్‌కు బోటు షికారును నిలిపివేసింది. పర్యాటకుల నుంచి ఒత్తిడి పెరగ డంతో 2023లో హోప్ ఐలాండ్‌కు బోటు షికారు ప్రారంభించడానికి ఏపీటీడీసీ ప్రయత్నించింది. పాత బోటు మేజువాణిని తిరిగి ప్రారంభించ డానికి సిద్ధపడింది. కానీ సముద్రంలో ప్రయా ణించడానికి కావాల్సిన ఫిట్‌నెస్ లేకపోవడంతో బోటుకు కాకినాడ పోర్టు లెసెన్సు తిరస్కరిం చింది. కొత్త బోటు కొనాలనుకున్నా గత వైసీపీ సర్కారు పర్యాటకశాఖకు అనుమతివ్వలేదు. ప్రై వేటు పార్టీల ద్వారా 50 సీట్లతో బోటు షికారు ప్రారంభించడానికి ప్రైవేటు ఏజన్సీల నుంచి బిడ్లు ఆహ్వానించినా కార్యరూపం దాల్చలేదు.
కళ్లను కట్టిపడేస్తాయి..
కాకినాడ అంటే పర్యాటకులకు ఠక్కున గుర్తొ చ్చేది హోప్ ఐలాండ్. సుమారు 200 ఏళ్ల కిందట సముద్రం మధ్యలో 16 కిలోమీటర్ల మేర సహజసిద్ధంగా ఏర్పడ్డ ఈ ద్వీపం కాకి నాడను రక్షణ కవచంలా కాపాడుతోంది. ఈ ఐలాండ్ పర్యాటకులకు పంచే ఆనందం అంతా ఇంతా కాదు. దీన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.అందుకే దూరప్రాంతాల నుంచీ వచ్చి పర్యాటకులు వాలిపోతారు. చుట్టూ నీలిసముద్రం.. నీటిపై తేలియాడుతూ కట్టిప డేసే మడ అడవులు ప్రకృతి ప్రియులకు మా టల్లో వర్ణించలేని అనుభూతి అందిస్తాయి.
టిక్కెట్ ధర రూ.2500
కోరంగి అభయారణ్యం నుంచి బయలుదేరే బోట్లు హోప్ ఐలాండ్‌కు ఒకరూట్, కోరంగి నుంచి భైరవపాలెంలోని బ్రిటిష్‌కాలం నాటి లైట్‌హౌస్ వద్దకు మరో రూట్ చొప్పున రోజు నాలుగు స్పీడ్‌బోట్లు నడవనున్నాయి. వాస్త వానికి చొల్లంగి వద్ద అభయారణ్యం నుంచి హోప్ ఐలాండ్‌కు బోట్లలో మూడు గంటలు పడుతుంది. స్పీడ్‌బోట్‌లో గంటన్నరలో వెళ్ల వచ్చు.అటు బ్రిటిష్‌కాలంలో కోరంగికి నౌకలు రావడం కోసం భైరవపాలెంలో నిర్మించిన లైట్‌హౌస్ చూడ్డానికి ఎందరో ఇష్టపడతారు. ఈ రెండు మార్గాల్లో సముద్రంలో షికారుకు వెళ్లే పర్యాటకులకు టిక్కెట్ ఒక్కరికి రూ. 2,500 చొప్పున నిర్ణయించారు. నలుగురు ప్ర యాణించే ఈ స్పీడ్‌బోట్ ఒకసారి హోప్ ఐలాండ్, లైట్‌హౌస్‌కు వెళ్లి రావడానికి డీజిల్ రూ.6 వేలు అవుతుందని అధికారులు చెబు తున్నారు. అందుకే టికెట్ ధర రూ.2,500 చొప్పున నిర్ణయించామని తెలిపారు. ఈ స్పీడ్ బోట్‌లో సముద్రంలో నచ్చినచోటకు వెళ్లి రా వడానికి రూ.10 వేలకు అద్దెకు ఇవ్వాలని అ టవీశాఖ నిర్ణయించింది. పర్యాటకులే సొం తంగా డీజిల్ కొట్టించుకోవాలి. హోప్ ఐలాం డ్ షికారుకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసు కునేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోరంగి వద్ద ఆదివారం నుంచి టిక్కెట్లు విక్రయిస్తారు.
గోదావరిలో హాయ్‌హాయ్..
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కోనసీమ జిల్లాలోని దిండిలో పర్యాటకశాఖ ఎప్పటి నుంచో గోదావరిలో బోటు షికారు నిర్వహిస్తోంది. ఘాట్‌ల నుంచి ఇరవై నిమి షాలపాటు స్పీడ్ బోట్‌ల్లో పర్యాటకులను తిప్పుతున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం లో పర్యాటక శాఖ, ప్రైవేటువి కలిపి మూడు, దిండిలో ఒకటి ఉన్నాయి. వీటికి పర్యాటకుల నుంచి ఆదరణ అధికంగా ఉంటోంది. ఆదివా రం, ఇతర సెలవు రోజుల్లో రోజుకు 700 మంది వరకు గోదావరిలో విహరిస్తున్నారు. పెరుగు తున్న డిమాండ్ నేపథ్యంలో మరో మూడు స్పీడ్ బోట్లు కొనుగోలుకు పర్యాటక శాఖ నిర్ణ యించింది. వీటిని రెండు రాజమహేంద్రవరం, ఒకటి దిండిలో తిప్పాలని భావిస్తోంది. ఒక్కో బోటు రూ.14 లక్షల ఖరీదు ఉంటుంది.