Share News

ఉగాది.. సందడి

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:04 AM

ష డ్రుచుల సమ్మేళనం మన జీవిత గమనానికి నిదర్శనమని కలెక్టర్‌ పిప్రశాంతి అన్నారు.

ఉగాది.. సందడి
ఉగాది ఉత్సవంలో కలెక్టర్‌ ప్రశాంతిని సత్కరిస్తున్న సన్మానగ్రహీతలు చిత్రంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి , ఎమ్మెల్సీ సోము, జేసీ చిన్నరాముడు, ఆర్‌డీవో కృష్ణనాయక్‌ తదితరులు

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ష డ్రుచుల సమ్మేళనం మన జీవిత గమనానికి నిదర్శనమని కలెక్టర్‌ పిప్రశాంతి అన్నారు.జిల్లా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వ ర ఆనంకళాకేంద్రంలో ఆదివారం జరిగిన శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఉగాది తెలుగు వారి పండుగ అన్నారు. ఈ ఉగాది -మన సంకల్పం అనే కవితను కలెక్టర్‌ చదివి వినిపించారు.ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ తెలుగు వారి పండుగను అధికారికంగా నిర్వహించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు పంచాగ శ్రవణం చేస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుందన్నారు.అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉగాది వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి పండుగలు ప్రభుత్వం నిర్వహించడం ద్వారా భవిష్యత్తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వంగా అందించడం సాధ్య మవుతుందన్నారు.తొలుత శుభమంగళ నాదస్వరం కె.వెంకటేశ్వర్లు అందించారు.సిద్ధాంతి ఏవీఎన్‌డీ శ్రీనివాసులు పం చాగ శ్రవణం చేశారు.శ్రీవిజయశంకర ప్ర భుత్వ సంగీత కళాశాల బృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వేడుకల్లో జేసీ ఎస్‌.చిన్నరాముడు,డీఆర్‌వో టి.సీతారామ్మూర్తి,ఆర్‌డీవోలు ఆర్‌.కృష్ణనాయక్‌,రాణి సు స్మిత,ఇన్‌ చార్జి జిల్లా దేవాదాయ అధికారి తోట సుబ్రహ్మణ్యం,కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీఎస్‌ భాస్కరరెడ్డి,సీపీవో ఎల్‌.అ ప్పలకొండ,వ్యవసాయాధి కారి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. అందరూ ఆనందంగా ఉండాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం జేఎన్‌ రోడ్డులోని ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌హాలులో ఆదివారం ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం నిర్వహించారు.వివిధ రంగాలకు చెందిన 60 మంది ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేసి సత్కరించారు. విశ్వావసు అంటే సంపదలన్నీ ఇచ్చే విష్ణుమూర్తి అని అన్నారు. జ్యోతిష ప్రవీణ పుల్లెల సత్యనారాయణ పంచాంగ శ్రవణం చేశారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకట్రాజు, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు, అడిషనల్‌ ఎస్‌పీ (అడ్మిన్‌) ఎన్‌బీఎం మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 01:04 AM