గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 01:04 AM
నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.
కొత్తపేట, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం వాడపాలెం గ్రామంలో ఇంటింటికి తాగునీటి పథకం ద్వారా నిర్మించిన వాటర్ ట్యాంకును, తాగునీటి పంపిణీ కుళాయిలను వారు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. అనంతరం సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్పంచ్‌గా ఎన్నికై ఢిల్లీలో అవార్డును అందుకున్న త్సామా ఆదినారాయణమూర్తి(బాబు)ను వారు సత్క రించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.