నిడదవోలులో మారుతున్న రాజకీయం
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:10 AM
నిడదవోలు పురపాలక సంఘంలో జనసేన పాగా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కొ క్కరుగా జనసేన పంచన చేరుతున్నారు.

కౌన్సిల్‌లో 11కి పెరిగిన బలం
టచ్‌లో మరో ముగ్గురు?
నిడదవోలు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : నిడదవోలు పురపాలక సంఘంలో జనసేన పాగా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కొ క్కరుగా జనసేన పంచన చేరుతున్నారు. నిడదవోలులో వైసీపీకి చెందిన సీనియర్ నాయకురాలు, 6వ వార్డు కౌన్సిలర్ పువ్వల రతీదేవి,8వ వార్డు కౌన్సిలర్ గుర్రం శాంతిశ్రీ , జిల్లా వైసీపీ బీసీ సెల్ సెక్రటరీ గంగుల గోపియాదవ్, పట్టణ వైసీపీ ఎస్సీ సెల్ అధ్య క్షుడు గుర్రం జేమ్స్ సోమవారం జనసేన తీర్థం పుచ్చుకున్నారు.ఈ మేరకు రాష్ట్ర పర్యా టక,సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ జనసేన కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో నిడద వోలు పురపాలక సంఘంలో 28వ వార్డులకు 27 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధిం చగా.. ఒక టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు. ఇటీ వల జరిగిన రాజకీయ పరిణామాల్లో వైసీపీ నుంచి 9 మంది కౌన్సిలర్లు జనసేనలో జాయిన య్యారు. సోమవారం మరో ఇద్దరు చేరడంతో కౌన్సిల్‌లో జనసేన బలం 11కి పెరిగింది. దీనికి తోడు ఒక టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు. త్వరలో మరో ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు జనసేనతో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. త్వరలో జరగనున్న అవిశ్వాస తీర్మానంలో ము నిసిపల్ కౌన్సిల్‌ను జనసేన ఖాతాలో వేసేం దుకు జనసేన నాయకులు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, పెన్మెత్స చందులు వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నారు.