శరవేగంగా..
ABN , Publish Date - Jan 14 , 2025 | 01:34 AM
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ సెంటర్ టవర్ (ఏటీసీ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనుల్లో అంతర్భాగంగా ఏటీసీ టవర్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్లుగా ఈ టవర్ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినప్పటికీ ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏటీసీ టవర్ పనులు
- జూన్ నెలాఖరు నాటికి అందుబాటులోకి..
- ఏర్పాటుకానున్న అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ సెంటర్ టవర్ (ఏటీసీ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనుల్లో అంతర్భాగంగా ఏటీసీ టవర్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్లుగా ఈ టవర్ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినప్పటికీ ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు కూడా 60 శాతం మేర పురోగతిలో ఉన్నాయి. జూన్ నెలాఖరు నాటికి టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ నిర్మాణ పనులు పూర్తికానున్నాయి. ఏటీసీ టవర్ నిర్మాణ పనులన్నీ పూర్తయినా ప్రస్తుతం ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. టవర్ రూఫ్ పనులు కూడా తుది దశలో ఉన్నాయి. ఏటీసీ టవర్‌లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు ఏటీసీ టవర్ ఇచ్చే సంకేతాల ద్వారానే జరుగుతాయి. ఏటీసీ టవర్‌కు అనుసంధానంగా ఏటీసీ కాంప్లెక్స్ నిర్మించారు. ఇక్కడ కూడా ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. గ్లాస్ ఫిటింగ్ పనులు చేస్తున్నారు. ఏటీసీ కాంప్లెక్స్‌లో ఎలక్ర్టికల్, ఇంజనీరింగ్ తదితర విభాగాలు కొలువుతీరతాయి.