Share News

Tirumala: శ్రీవారి సేవలో ఆర్థిక సంఘం చైర్మన్‌

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:41 AM

తిరుమలలో శ్రీవారి సేవలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగారియా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్‌, క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ దర్శనాలు పొందారు

Tirumala: శ్రీవారి సేవలో ఆర్థిక సంఘం చైర్మన్‌

తిరుమల, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం వేకువజామున జరిగిన సుప్రభాతం, అభిషేకం సేవలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగారియా, సభ్యులు పాల్గొని మూలమూర్తిని దర్శించుకున్నారు. వారికి రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి చిత్రపటం, లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, పార్లమెంటరీ ఇండస్ట్రీ కమిటీ సభ్యులు, క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 05:41 AM