Share News

బియ్యం మాయం కేసులో మరో నలుగురు అరెస్ట్‌

ABN , Publish Date - Jan 13 , 2025 | 01:01 AM

పేర్ని నాని గోడౌన్‌ నుంచి బియ్యం మాయం కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. మచిలీపట్నానికి చెందిన మాతా వెంకటసుబ్బారావు, పామర్తి నాగేశ్వరరావు, గోపిశెట్టి నాంచారయ్య, కందుల బాపూజీలను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా, వారికి ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్‌ విధించినట్లు ఆర్‌పేట సీఐ ఏసుబాబు వెల్లడించారు.

బియ్యం మాయం కేసులో మరో నలుగురు అరెస్ట్‌

- న్యాయమూర్తి ఎదుట హాజరు.. 24 వరకు రిమాండ్‌

- మచిలీపట్నంలోని జైలుకు నిందితుల తరలింపు

మచిలీపట్నం, జనవరి12 (ఆంధ్రజ్యోతి): పేర్ని నాని గోడౌన్‌ నుంచి బియ్యం మాయం కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. మచిలీపట్నానికి చెందిన మాతా వెంకటసుబ్బారావు, పామర్తి నాగేశ్వరరావు, గోపిశెట్టి నాంచారయ్య, కందుల బాపూజీలను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా, వారికి ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్‌ విధించినట్లు ఆర్‌పేట సీఐ ఏసుబాబు వెల్లడించారు. గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌తేజ, మిల్లు యజమాని బాల ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ మంగారావు సహకారంతో ఈ నలుగురు గోడౌన్‌ నుంచి బియ్యం కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బియ్యం కొనుగోలులో డొక్కు నాగరాజు అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. అయితే అతను ఇటీవల మరణించారు. మిల్లు యజమాని బాలఆంజనేయులుతో నాగరాజుకు ఉన్న స్నేహం కారణంగా గోడౌన్‌ నుంచి బియ్యం కొనుగోలు చేసినట్లుగా పోలీస్‌ విచారణలో తేలింది. కాగా, పేర్ని నాని గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో ఇప్పటి వరకు 10మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 13 , 2025 | 01:02 AM