పెట్రోల్ బంకులో ఘరానా మోసం
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:39 PM
పెట్రోలు బంకు నిర్వాహకుల ఘరానామోసం బట్ట బయలైంది. ఆస్పరి బైపా్‌సలో ఉన్న ఓ పెట్రోల్ బంకుకు మండలం గణేకల్లు గ్రామానికి చెందిన గౌండా పాండురంగ శుక్రవారం కె.ఏ 01ఈటి 3288 ద్విచక్ర వాహనంలో వెళ్లాడు.
రూ.1210కు 8 లీటర్లు
అనుమానం వచ్చి కొలిచిన ద్విచక్ర వాహనదారుడు
తప్పైందని అంగీకరించిన నిర్వాహకులు
ఆదోని రూరల్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : పెట్రోలు బంకు నిర్వాహకుల ఘరానామోసం బట్ట బయలైంది. ఆస్పరి బైపా్‌సలో ఉన్న ఓ పెట్రోల్ బంకుకు మండలం గణేకల్లు గ్రామానికి చెందిన గౌండా పాండురంగ శుక్రవారం కె.ఏ 01ఈటి 3288 ద్విచక్ర వాహనంలో వెళ్లాడు. బెంగుళూరుకు వెళుతూ మార్గమధ్యంలో ఆదోని ఆస్పరి బైపా్‌సలో ఉన్న లక్ష్మీ చెన్నకేశవ హెచపి పెట్రోల్ బంకుకు వెళ్లాడు. రూ.1210/-లు పెట్రోలు వేయించుకున్నా ట్యాంకు నిండకపోవడంతో అనుమానం వచ్చి బండి ట్యాంకులో పోసిన పెట్రోల్‌ను చెక్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నిర్వాహకులు బండిలో ఉన్న పెట్రోలును కొలిచారు. దాదాపు 12లీటర్లు ఉండాల్సిన చోట 8లీటర్లే తేలింది. దీంతో ద్విచక్ర వాహన దారుడు పెట్రోల్ బంకు నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగాడు. దీంతో పెట్రోలు బంకు సిబ్బంది తప్పైందని అంగీకరించారు. డబ్బులు ఇస్తామని, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పి నగదు వాపసు ఇచ్చాను.