Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో విడుదల..
ABN , Publish Date - Mar 20 , 2025 | 09:10 PM
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శుక్రవారం ఆన్‌లైన్ ద్వారా పలు సేవలకు సంబంధించిన టికెట్లను అందుబాటులోకి తేనుంది..

తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు శుభవార్త చెప్పింది. పలు శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను శుక్రవారం అందుబాటులోకి తేనుంది. శ్రీవారి కళ్యాణం, ఉజ్వల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్రదీపాలంకరణ సేవల జూన్ నెల కోటా టికెట్లు శుక్రవారం అందుబాటులోకి రానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు భక్తులు ఆన్‌లైన్ ద్వారా టికెట్లను పొందొచ్చు. ఆన్‌లైన్ సేవలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఉజ్వల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్రదీపాలంకరణ సేవల టికెట్లు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. 2025, జూన్ 9వ తేదీనుంచి 11వ తేదీ వరకు జరగనున్న జ్యేష్టాభిషేకం సేవకు సంబంధించిన టికెట్లు కూడా శుక్రవారం ఉదయం 10 గంటలకు అందుబాటులోకి రానున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. బుధవారం అర్థరాత్రి వరకు 72,388 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో ఏకంగా 3.97 కోట్లు సమర్పించారు. ఇక, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో టీటీడీ శ్రీవారి దర్శనాన్ని కల్పించనుంది. ఈ విధానం మార్చి 24వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమవారాల్లో మాత్రమే స్వీకరించనుంది. సోమ, మంగళవారాల దర్శనాలకు మాత్రమే అది వర్తించనుంది.
Also Read:
ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే...
అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..
టూత్‌పిక్‌తో దంతాలను శుభ్రం చేస్తే.. ఇంత డేంజరా?