SSC Exams: అధికారుల పొరపాటు.. ఒక పేపర్‌కు బదులు మరో పేపర్
ABN , Publish Date - Mar 17 , 2025 | 09:33 PM
సోమవారం పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈ సారి మొత్తం 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రంజాన్ పండుగ ఆధారంగా చివరి పరీక్ష మార్చి 31వ తేదీన కానీ, ఏప్రిల్ ఒకటవ తేదీన కానీ, నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. చివరి పరీక్షను రంజాన్ పండుగ ఆధారంగా మార్చి 31వ తేదీన కానీ, ఏప్రిల్ ఒకటవ తేదీన కానీ, నిర్వహించనున్నారు. 2024-2025 విద్యాసంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నేపథ్యంలో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పరీక్ష సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటోంది. ఎంత పగడ్భందీగా ప్లాన్ చేసినా.. కొన్ని చోట్ల తప్పులు జరుగుతూనే ఉన్నాయి. తెనాలి ఎన్ఎస్ఎం పాఠశాలలో అధికారులు పొరపాటు చేశారు. ఓ విద్యార్ధికి స్పెషల్ తెలుగు ప్రశ్నాపత్రం పంపిణీ చేయడానికి బదులు సాధారణ ప్రశ్నాపత్రం పంపిణీ చేశారు. జరిగిన పొరపాటుపై అధికారులు అధికారులు విచారణ చేపట్టారు. జాబితా చూసుకోకుండా వేరే ప్రశ్నాపత్రం ఇచ్చిన ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు.
పాము కరిచినా పరీక్ష రాశాడు..
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురానికి చెందిన నిస్సీ అనే విద్యార్థికి శనివారం నాగు పాము కాటు వేసింది. చెట్టు కింద కూర్చుని చదువుతూ ఉండగా పాము కరిచింది. దీంతో ఉపాధ్యాయులు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతడికి చికిత్స అందించారు. శనివారం, ఆదివారం అక్కడే ఉన్నాడు. సోమవారం పరీక్షలు మొదలు కావటంతో ఆస్పత్రినుంచి నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష రాశాడు. అనంతరం మళ్లీ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. ఆరోగ్యం కుదుట పడేవరకు ఇాలా ఆస్పత్రికి .. పరీక్షా కేంద్రానికి తిరగకతప్పేలా లేదు. చదువులన్నా.. పరీక్షలన్నా భయపడే పిల్లలున్న ఈ కాలంలో.. నిస్సికి చదువుపట్ల ఉన్న శ్రద్ధా భక్తులు చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి..
CM Chandrababu: పొట్టి శ్రీరాములు జయంతి వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం