Home » Guntur
కాజీపేట - విజయవాడ సెక్షన్లో మోటుమర్రి వద్ద నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా గుంటూరు నుంచి ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గుంటూరు నడిబొడ్డున తగిన అనుమతులు లేకుండా నిర్మిస్తున్న గ్రీన్‌గ్రేస్ హైరైజ్డ్ బిల్డింగ్స్‌ని కాపాడేందుకు పైస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Andhrapradesh: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వికసిత భారత్ మోడీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాను అభివృద్ధి రంగంలో ముందు వరుసలో ఉంచుతామని లంకాదినకర్ అన్నారు. నగరంలో అండర్ డ్రైనేజ్ రూ.540 కోట్లతో అభివృద్ధి చేయాలని చూస్తే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
Andhrapradesh: గుంటూరు, ప్రకాశం జిల్లా రైతులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్నారు. గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం సాగర్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. రెండు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. వైసీపీ నేతలు వారి పాలన మొత్తం అరాచకాలపై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివాలా దశలో ఉన్న ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేసి అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని, ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని చైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు
గుంటూరు జిల్లా: అధికారంలో లేకపోయినా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు అక్కడక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతునే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేత ఆరిక శ్రీనివాస్ అర్ధరాత్రి బాల వికాస కేంద్రంలో చర్చి కూల్చివేశాడు. ప్రోక్లైనర్‌తో భవనాలు కూల్చివేసే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న స్థానికులపై తన రౌడీలతో దాడికి యత్నించాడు.
వలసలను నివారించి.. కూలీలకు ఉపాధి కల్పించాల్సిన ఉపాధి హామీ పథకం నుంచి అక్రమార్కులు కాసులు పిండుకుంటున్నారు.
విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నత వైద్యులుగా తీర్చిదిద్దిన గుంటూరు వైద్య కళాశాల రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షణీయమని ఎన్నారై డాక్టర్ పొదిల ప్రసాద్ తెలిపారు.
ద్విచక్ర వాహనాలను నడపడంలో తాము నేర్పరులమని, హెల్మెట్లు అవసరం లేదని కొందరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
Andhra Pradesh News: నదీ గర్భంలోని ఇసుక తవ్వి తీసుకురావాలంటే కష్టమనుకున్నారేమో.. ఏకంగా నదిలోనే రోడ్డు వేసుకుంటున్నారు. నది మధ్య వరకు వాహనాలను తీసుకెళ్లి ఇసుక తవ్వి..