Home » Andhra Pradesh » Guntur
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆశలు, ఆశయాలు నిర్దేశించుకోవాలని, వాటిని నేరవేర్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.
CM Chandrababu: గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎడాపెడా జగన్ అప్పులు చేశారని ఆరోపించారు. గత ఐదేళ్లు నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిన పెట్టడం వల్ల ప్రజల్లో మరింత నమ్మకం వచ్చిందని అన్నారు. జగన్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
CM Chandrababu:తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.
AP pensions: ప్రతి నెలా 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేస్తోంది. పెన్షన్ల పంపిణీలో ప్రతి నెలా రికార్డులు తిరగ రాస్తున్న విషయం తెలిసిందే.
IAS officers: ఏపీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పదోన్నతులు కల్పిచింది. ఐదుగురు IAS అధికారులకు పదోన్నతులు కల్పించింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ సీఎస్‌గా సురేష్ కుమార్‌ను నియమించింది.
BJP MLA Pardhasaradhi: వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి సంచలన ఆరోపణలు చేశారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలనేది తమ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వాలు వేసే పాలకమండళ్లకు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి దేవాలయాలపై అంత భక్తి శ్రద్ధలు ఉండకపోవచ్చుని తెలిపారు.
Lanka Dinakar: నదుల అనుసంధానంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కృష్ణా నదిలో ఆ స్థాయిలో నీటి లభ్యత కష్టంగా మారిందని చెప్పారు. ఈ తరుణంలో వెలిగొండ వరకు నదుల అనుసంధానం చేయడం ద్వారా 23 లక్షల మందికి తాగు నీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని అన్నారు.
Andhrapradesh: ‘‘ఇంటింటికి వచ్చి పింఛన్ అందిస్తున్నాం. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీస్‌లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తా. ఫోన్లో జీపీఎస్ ద్వారా సమాచారం వస్తుంది. డ్రోన్‌తో కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Palla Srinivasa Rao: అసమర్థత, అవినీతి, ఆరోపణల మీద తప్ప మంత్రుల మార్పు ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఉండదని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థలో నాలుగేళ్ల వరకు పదవి కాలం ఉంటుంది కనుక ..ఆ సమయం పూర్తి అయిన తర్వాత ఆలోచన చేస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. పల్నాడు జిల్లా, నర్సరావుపేట మండలం, ఎలమంద గ్రామంలో సీఎం చంద్రబాబు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు.