Share News

River linking : హంద్రీ-నీవా, గాలేరు-నగరి అనుసంధానం!

ABN , Publish Date - Jan 09 , 2025 | 04:38 AM

రాయలసమీలో కీలక ప్రాజెక్టులైన హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి అనుసంధానంపై దృష్టిసారించాలని జల వనరుల శాఖ

River linking : హంద్రీ-నీవా, గాలేరు-నగరి అనుసంధానం!

కార్యాచరణపై అధ్యయనం చేయండి.. మంత్రి నిమ్మల ఆదేశం

అమరావతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రాయలసమీలో కీలక ప్రాజెక్టులైన హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి అనుసంధానంపై దృష్టిసారించాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుతోపాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన చీఫ్‌ ఇంజనీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రి సమీక్ష జరిపారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు లేదా గండికోట రిజర్వాయరు నుంచి హంద్రీ-నీవాను అనుసంధానించే క్రమంలో ఆర్థికంగానూ, రైతులకు ప్రయోజనం చేకూర్చే కార్యాచరణపైనా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. గాలేరు-నగరి నుంచి హంద్రీ-నీవాను కలిపే లింకు పనులకు సంబంధించిన పూర్తి సమాచారంతో త్వరలోనే సీఎంతో చర్చిద్దామన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 04:38 AM