Share News

ఘనంగా ఫాతిమా షేక్‌ జయంతి

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:48 AM

సావిత్రీబాయి ఫూలే శిష్యురాలు ఫాతిమాషేక్‌ జయంతిని గురువారం బహుజన పరిరక్షణ సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఫాతిమా షేక్‌ జయంతి
పాతిమాషేక్‌ చిత్ర పటం వద్ద నివాళ్లు అర్పిస్తున్న దృశ్యం

కదిరి అర్బన, జనవరి 9(ఆంధ్రజ్యోతి): సావిత్రీబాయి ఫూలే శిష్యురాలు ఫాతిమాషేక్‌ జయంతిని గురువారం బహుజన పరిరక్షణ సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వికలాంగుల భవనంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ ఇర్షాన, సేవాసమితి నాయకులు కేఆర్‌ హరిప్రసాద్‌, వేణుగోపాల్‌, మనోహర్‌, పవనకుమార్‌, దిల్‌షాద్‌, రామలమ్మ, శోభారాణి పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 12:48 AM