Former Chairman Ramesh Reddy : రమేశ్‌రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:26 AM
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ అలవాల రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు 48 గంటల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు

లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కొలికపూడి
తిరువూరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ అలవాల రమేశ్‌రెడ్డిపై 48గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలోని పలు గిరిజన తండాలకు చెందిన మహిళలు గురువారం తిరువూరులోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చి నిరసన తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.