Share News

Blast Aid Released: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ABN , Publish Date - Apr 17 , 2025 | 05:56 AM

అనకాపల్లి జిల్లాలో బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందించిన హోం మంత్రి వంగలపూడి అనిత. మిగిలిన ఇద్దరికి కూడా త్వరలో చెక్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు

Blast Aid Released: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

  1. రూ.15 లక్షల చొప్పున చెక్‌లు అందించిన హోం మంత్రి

కోటవురట, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ నెల 13న జరిగిన పేలుడులో మృతిచెందిన వారి కుటుంబాలకు హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం ఎక్స్‌గ్రేషియాచెక్కులు అందజేశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందగా.. వీరిలో కోటవురట్ల మండలానికి చెందినవారు ఆరుగురు ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో దేవర నిర్మలది కాకినాడ జిల్లా సామర్లకోట, మెడిసి హేమంత్‌ స్వస్థలం విశాఖ జిల్లా భీమిలి. వీరికి కూడా చెక్కులు అందిస్తామని చెప్పారు.

Updated Date - Apr 17 , 2025 | 05:56 AM