Share News

అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:06 AM

అర్హులకు ఇళ్లస్థలాలు మం జూరు చేయాలని సీపీఐ నాయకులు స్థానిక తహసీల్దార్‌ కార్యలయం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు.

అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న సీపీఐ నాయకులు

పుట్టపర్తిరూరల్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): అర్హులకు ఇళ్లస్థలాలు మం జూరు చేయాలని సీపీఐ నాయకులు స్థానిక తహసీల్దార్‌ కార్యలయం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ అనుపమకు వినతి పత్రం అందచేశారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ.. పేదలకు గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా ఆ హామీ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద్‌, మహిళా సమైఖ్య జిల్లా అధ్యక్షురాలు జయలక్ష్మీ సీపీఐ పట్టణ నాయకులు బాషా, గంగాదర్‌, జయమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:06 AM